Radheshyam : “రాధే శ్యామ్‌” నుంచి అదిరిపోయే సాంగ్‌ రిలీజ్‌

-

రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ హీరో గా నటిస్తున్న లెటెస్ట్‌ మూవీ రాధేశ్యాం. పాన్‌ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా ను టాలీవుడ్‌ యంగ్‌ టాలెంటెడ్‌ డైరెక్టర్‌ రాధాకృష్ణ డెరెక్ట్‌ చేస్తున్నాడు. ఈ సినిమా యూవీ క్రియేషన్స్‌ సమర్పణ లో తెరకెక్కతోంది. 1960 నాటి వింటేజ్‌ ప్రేమకథ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం లో ప్రభాస్‌ టాలీవుడ్ బుట్ట‌బొమ్మ పూజాహెగ్డే జంటగా న‌టిస్తుంది.

భారీ బడ్జెట్‏ మూవీగా యూవీ క్రియేషన్స్, టీసిరీస్ బ్యానర్లపై భూషణ్ కుమార్, వంశీ, ప్రమోద్, ప్రసీద సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే.. తాజాగా ఈ సినిమా ను ఓ బిగ్‌ అప్డేట్‌ వచ్చేసింది. ఈ సినిమా నుంచి హిందీ వర్షన్‌ సాంగ్‌ ను విడుదల చేసింది చిత్ర బృందం. హిందీ వర్షెన్‌ లో సాగే… ఈ సాంగ్‌ “మెయిన్‌ ఇష్క్ మే హూన్” అనే లిరిక్స్‌ తో ప్రారంభం అవుతుంది. ఇక ఈ సాంగ్‌ లో ప్రభాస్‌, పూజా హెగ్డే చాలా అందంగా కనిపించారు. లవ్‌, ఎమోషనల్‌ ఫీలింగ్‌ ఇద్దరూ అలరించారు. దీని ఫుల్‌సాంగ్ రేపు విడుదల కానుంది. కాగా సినిమా మార్చి 11న విడుదల కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news