అదిరే స్కీమ్… రూ.100 పొదుపుతో రూ.15 లక్షలు..!

-

కేంద్రం ఎన్నో రకాల స్కీమ్స్ ని అందిస్తోంది. ఈ స్కీమ్స్ లో డబ్బులు పెడితే మంచిగా లాభం పొందొచ్చు. పైగా అన్ని స్కీమ్స్ కంటే ఈ స్కీమ్ లో డబ్బులు ఎక్కువ వస్తాయి. అదే సుకన్య సమృద్ధి యోజన. సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ లో డబ్బులని ఇన్వెస్ట్ చెయ్యచ్చు. ఎలాంటి రిస్క్ కూడా ఉండదు. పైగా ట్యాక్స్ బెనిఫిట్స్ ని కూడా పొందొచ్చు. ఇక దీని గురించి పూర్తి వివరాల లోకి వెళితే..

సుకన్య సమృద్ధి యోజన పథకం పై ఇప్పుడు 7.6 శాతం వడ్డీ రేటు లభిస్తోంది. ఈ స్కీమ్ లో డబ్బులు ఎక్కువ వస్తాయి. స్మాల్ సేవింగ్ స్కీమ్స్‌తో పోలిస్తే దీనిలో ఎక్కువ వడ్డీ వస్తుంది. ఈ వడ్డీ రేట్లు మూడు నెలలకి ఒకసారి మారుతూ ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం త్రైమాసికం చొప్పున ఈ స్కీమ్స్‌ వడ్డీ రేట్లను మారుస్తూ ఉంటుంది. వడ్డీ రేట్లలో మార్పులు చోటు వస్తాయి. లేదంటే అలానే వస్తాయి.

ఈ స్కీమ్‌లో డబ్బులు పెట్టడం వల్ల ట్యాక్స్ బెనిఫిట్స్ వున్నాయి. ప్రతి ఏటా రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు ఉంటుంది. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద ఈ ప్రయోజనం పొందొచ్చు. ఒక ఏడాదిలో రూ.1.5 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు. కనీసం రూ.250 ఇన్వెస్ట్ చేసినా చాలు.

రోజుకు రూ.100 చొప్పున పొదుపు చేసిన నెలకు రూ.3 వేలు సుకన్య సమృద్ధి యోజన పథకంలో పెడితే మెచ్యూరిటీ సమయంలో రూ.15 లక్షలు వస్తాయి. స్కీమ్ మెచ్యూరిటీ కాలంలో 21 ఏళ్లు. అమ్మాయికి 18 ఏళ్లు వచ్చిన తర్వాత కొంత మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు. పదేళ్లలోపు వయసు కలిగిన ఆడ పిల్లలకు మాత్రమే ఈ స్కీమ్ వర్తిస్తుంది. ఈ స్కీమ్ లో చేరాలంటే పోస్టాఫీస్ లేదా బ్యాంక్‌కు వెళ్లి పథకంలో చేరవచ్చు. బర్త్ సర్టిఫికెట్, ఆధార్ కార్డు, ఫోటోలు ఉంటే సరిపోతుంది.

Read more RELATED
Recommended to you

Latest news