తెలంగాణ లో సీఎం కేసీఆర్ ఇప్పుడు కొంత మంది మంత్రుల పనితీరు విషయంలో చాలా వరకు కూడా సంతోషంగా ఉన్నారు. ప్రధానంగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పనితీరు విషయంలో ఆయన చాలా సంతోషంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. అజయ్ కుమార్ గత కొన్ని రోజులుగా అభివృద్ధి కార్యక్రమాల విషయంలో చాలా దూకుడుగా వెళుతున్నారు. తన సొంత జిల్లాను అభివృద్ధి చేసుకునే విషయంలో పువ్వాడ అజయ్ కుమార్ చాలా ఆసక్తి చూపిస్తున్నారు.
ఆయన పని తీరు ముఖ్యమంత్రి కేసీఆర్ కు చాలా బాగా నచ్చుతుంది. అయితే ఇప్పుడు పువ్వాడ అజయ్ కుమార్ కు మరి కొన్ని శాఖలు అప్పగించే అవకాశం ఉందని సమాచారం. ఆయన కొన్ని రోజులుగా టిఆర్ఎస్ పార్టీని బలోపేతం చేసే విధంగా ఖమ్మం జిల్లాలో అడుగులు వేస్తున్నారు. అందుకే ఇప్పుడు ఆయనకు కొన్ని కీలక శాఖలను అప్పగించి ఆలోచనలో సీఎం కేసీఆర్ ఉన్నారు అని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
కొన్ని కొన్ని అభివృద్ధి కార్యక్రమాల విషయంలో ముందుచూపుతో వ్యవహరిస్తున్న ఆయన విషయంలో టిఆర్ఎస్ పార్టీ నేతలు కూడా చాలా అనుకూలంగా ఉన్నారు. అందుకే తన సొంత జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాల బాధ్యత సీఎం కేసీఆర్ పువ్వాడ అజయ్ కుమార్ కు కేసీఆర్ ఇచ్చే ఆలోచనలో ఉన్నారని సమాచారం. త్వరలోనే ఆయన తో ఒక సారి సమావేశమైన తర్వాత కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం కేసీఆర్ కొన్ని సూచనలు కూడా చేసే అవకాశం ఉందని అలాగే రాష్ట్రంలో కూడా అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి మంత్రి నేతృత్వంలో ఒక కమిటీని కూడా వేసి ముందుకు నడిపించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.