అయ్యప్ప భక్తులు ఎంతో పవిత్రంగా భావించే మకర జ్యోతి నేటి సాయంత్రం దర్శనం ఇవ్వనుంది. ఈ మధ్యాహ్నానికి తిరు ఆభరణాలు స్వామి వారి ఆలయానికు చేరుకుంటాయని, ఆపై వాటిని స్వామికి అలంకరించి, తొలి హారతిని ఇచ్చే వేళ, మకర జ్యోతి దర్శనమిస్తుంది. అయితే ప్రతి ఏడాది సంక్రాంతి రోజున శబరిమలకు సుమారు 10 లక్షల మందికి పైగానే అయ్యప్ప భక్తులు చేరుకుని మకర జ్యోతిని దర్శించుకుంటారు.
అయితే ఈ సంవత్సరం కరోనా కారణంగా నిబంధనలను కఠినంగా అమలు చేస్తుండగా, భక్తుల సంఖ్య కేవలం 5000కే పరిమితం అయింది. జ్యోతి దర్శనానికి వచ్చే భక్తులు ముందు వర్చువల్ క్యూలో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. కేవలం ఐదు వేల మంది భక్తులు, అర్చకులు, అధికారుల సమక్షంలో ఈ రోజు మకర జ్యోతి దర్శనం జరగనుంది. శబరిమల చరిత్రలోనే మొదటిసారి మకరసంక్రాంతి నాడు ఇలా తక్కువ మందితో పూజలు జరుగుతున్నాయి.