ఏ సమస్య అయినా వాస్తు తో పరిష్కరించుకోవచ్చు. వాస్తు ప్రకారం అనుసరిస్తే ఎలాంటి ఇబ్బంది అయినా తొలగిపోతుంది. అలానే ఆనందంగా ఉండడానికి కూడా అవుతుంది. అయితే ఈ రోజు పండితులు బెడ్ రూమ్ లో ఎలాంటి మార్పులు చేస్తే బాగుంటుంది..?, మంచి కలుగుతుంది అనే దాని గురించి చెప్పారు. మరి ఇక ఎటువంటి ఆలస్యం లేకుండా పండితులు చెప్పిన అద్భుతమైన చిట్కాల గురించి చూసేద్దాం.
వాస్తు ప్రకారం ఈ విధంగా ఫాలో అయితే కచ్చితంగా సమస్యలన్నిటిని తొలగించుకోవచ్చు. చాలా మంది ఇంట్లో తరచూ ఏదో ఒక సమస్య వస్తుంది. అటువంటి వాళ్ళు కచ్చితంగా వీటిని అనుసరిస్తే మంచిది. ఎప్పుడూ కూడా బెడ్ రూమ్ ప్రశాంతంగా ఉండాలి. ఎందుకంటే అక్కడ మనం ఎక్కువ సేపు విశ్రాంతి తీసుకుంటూ ఉంటాము. కాబట్టి పాజిటివ్ ఎనర్జీ ఉండేటట్టు చూసుకోవాలి.
అలానే బెడ్రూం లో ఎంచుకునే రంగులు కూడా బాగుండాలి. మంచి ఆనందాన్నిచ్చేవి, పాజిటివ్ ఎనర్జీని ఇచ్చే రంగుల్ని ఉపయోగించాలి. అయితే బెడ్ రూమ్ లో ఎటువంటి రంగులు వేయాలి అనే విషయానికి వస్తే… పింక్, గ్రీన్ పసుపు రంగులు వేస్తే మంచిది. వీటి వల్ల ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. ఆర్థిక నష్టం వంటి సమస్యలు కూడా కలగవు.
పడమర వైపు ఉండే బెడ్ రూమ్ కి బ్లూ కలర్ వేస్తే మంచిది. అలాగే ఎరుపు రంగు కూడా మంచిదే. తూర్పు వైపు ఉండే బెడ్ రూమ్ కి పసుపు రంగు వేస్తే మంచిది ఇలా దిక్కుల ప్రకారం మీరు అనుసరించి రంగుల్ని వేస్తే చక్కని ఫలితం పొందవచ్చు.
పిల్లల గదిలో అయితే లైట్ గ్రీన్ రంగు వేస్తే మంచిది. ఇలా బెడ్రూంలో ఈ విధంగా మార్పులు చేస్తే ఆనందంగా, ఆరోగ్యంగా ఉండొచ్చు. అలాగే పాజిటివ్ ఎనర్జీ కూడా అక్కడే ఉంటుంది. కనుక ఈ విధంగా మార్పులు చేసి చూడండి. దీంతో సమస్యలు అన్నీ కూడా మాయమైపోతాయి.