మలయాళ సినిమా పరిశ్రమకు చెందిన డైరెక్టర్ సిద్ధికి నిన్నటి నుండి గుండె పోటు తో హాస్పిటల్ లో జాయిన్ అయిన సంగతి తెలిసిందే. కానీ ప్రాణాలతో పోరాడుతూ కాసేపటి క్రితమే అనంతలోకాలకు వెళ్లిపోయారు. ఈ ఊహించని దుర్ఘటనతో మలయాళ సినిమా పరిశ్రమ మూగబోయింది. ఈయన మరణం మళయాల సినిమా పరిశ్రమకు తీరనిలోటని చెప్పాలి, కొచ్చి లోని ఒక ప్రయివేట్ హాస్పిటల్ లో చికిత్సను తీసుకుంటూ మరణించారు. కాగా ఇతను కెరీర్ లో గాడ్ ఫాదర్, హిట్లర్, బిగ్ బ్రదర్, ఫ్రెండ్స్, కాబూలీవాలా లాంటి సినిమాలను డైరెక్ట్ చేశాడు. కాగా ఈయన బాడీ గార్డ్ సినిమాను సల్మాన్ ఖాన్ తో హిందీలో తెరకెక్కించారు. ఇక మలయాళీ స్టార్ నటుడిగా ఉన్న మోహన్ లాల్ బిగ్ బ్రదర్ మూవీ చేయగా, ఆ సినిమా తెలుగులోనూ డబ్ అయ్యి సక్సెస్ అయింది. ఈయన మరణం పట్ల సినీ ప్రముఖులు అంతా తమ సంతాపాన్ని తెలిపారు.
ఈ మధ్య సినిమా రంగానికి చెందిన చాలా మంది ప్రముఖుకులు చనిపోతూ ఉండడం అభిమానులకు చాలా బాధను కలిగిస్తున్నాయని చెప్పాలి.