Ram Charan – Shankar Movie: మెగా పవర్ స్టార్ కోసం విల‌న్ గా మారిన మలయాళం స్టార్!

-

Ram Charan – Shankar Movie: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో ఓ భారీ పాన్ ఇండియా మూవీ రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే. సాధార‌ణంగా శంక‌ర్ సినిమా అంటే సంచ‌ల‌నాల‌కు కేరాఫ్ అడ్ర‌స్. అలాంటిది పొలిటికల్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమాతో శంక‌ర్ ఎలాంటి సంచ‌నాల‌కు తెర తీయ‌బోతున్నారో చూడాలి. చరణ్ 15వ చిత్రంగా రిలీజ్ కాబోతుంది.

ఇందులో చ‌ర‌ణ్ స‌ర‌స‌న‌ కియారా అద్వాణీ హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవలే గ్రాండ్ గా సినిమా ప్రారంభోత్సవం జరిగింది. ఈ సినిమా షూటింగ్‌ను పూనేలో భారీ సెట్ వేసి ప్రారంభించారు. ఈ చిత్రంలో చరణ్ ఓ ఐఏఎస్ అధికారి న‌టించ‌నున్నారట‌. అయితే.. కొన్నికార‌ణాల వ‌ల్ల త‌న బాజ్ కు రాజీనామా చేసి రాజకీయ నాయకుడిగా మారితే రాజకీయ వ్యవస్థలో ఆ అధికారి ఎలాంటి మార్పులు చేస్తాడనేది ఈ చిత్ర‌ కథాంశంమని ఇండ‌స్ట్రీ టాక్. ఈ విష‌యం వైర‌ల్ కావ‌డంతో మ‌రో `భారతీయుడు` చిత్ర‌మ‌ని శంకర్ ఫ్యాన్ అంటున్నారు.

ఇదిలా ఉంటే.. మరో ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఒకటి బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈ సినిమాలో మ‌ల‌యాళ స్టార్ సురేశ్ గోపి విల‌న్ రోల్‌కు శంక‌ర్ తీసుకున్నార‌ని వార్త‌లు నెట్టింట హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. త్వరలోనే ఈ విష‌యంలో తుది నిర్ణయం బయటకు వచ్చే అవకాశం ఉందట‌. అలాగే ఈషా గుప్పా ఓ నెగిటివ్ రోల్ లో నటిస్తున్నట్లు సమాచారం. శంకర్ మార్క్ చిత్రంగా నిలుస్తుందని తెలుస్తోంది. ఇందులో శ్రీకాంత్..సునీల్ ..అంజలి కాలక పాత్రలు పోషిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పై దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news