కరెన్సీ నోటుతో ముక్కు తుడుస్తూ, కరోనా వ్యాధి కాదు అల్లా వేసిన శిక్ష అంటూ…!

-

ఒక పక్క ప్రపంచం మొత్తం కరోనా వైరస్ దెబ్బకు చుక్కలు చూస్తుంది. కరోనా వైరస్ ని ఏ విధంగా కట్టడి చెయ్యాలో అర్ధం కాక ప్రపంచ దేశాలు నరకం చూస్తున్నాయి. దాదాపు అన్ని దేశాలు కరోనా బారిన పడ్డాయి కరోనా వైరస్ ని ఎదుర్కోవడానికి ఇప్పటికే లాక్ డౌన్ ను షట్ డౌన్ లు అంటూ దేశాలు నానా కష్టాలు పడుతున్నాయి. కాని కొందరు అతి గాళ్ళు మాత్రం సోషల్ మీడియాలో చేస్తున్న చేష్టలు వివాదాస్పదంగా మారాయి.

మహరాష్ట్ర నాసిక్ జిల్లాకు చెందిన 40 ఏళ్ళ ఒక వ్యక్తి… రూ.500నోట్ల కట్టను ముక్కు నోటితో తుడుచుకుంటూ దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. దీన్ని గమనించిన అమెరికాకు చెందిన ప్రముఖ మీడియా సంస్థ ఫస్ట్ న్యూస్ తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేయగా అది వైరల్ అయింది. ఆ వీడియో లో అతను కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసాడు. ఇది ఒక వ్యాధి కాదని అన్నాడు.

అల్లా వేసిన శిక్ష అంటూ వివాదాస్పద కామెంట్ చేసాడు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. సదరు వీడియో తమ వద్దకు రావడంతో నాసిక్ పోలీసులు సైబర్ క్రైమ్ సాయంతో నిందితుడి కోసం గాలింపు జరపగా మాలెగావ్ లో ఉన్న సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకుని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసారు. నిందితుడిపై భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 153 మరియు 188 కింద కేసులు నమోదు చేసిన నాసిక్ పోలీసులు అతన్ని రిమాండ్ కి తరలించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version