తెలంగాణలో తగ్గిన డెంగ్యూ..పెరిగిన మలేరియా..!

-

ఓ వైపు కరోనా మరోవైపు వైరల్ జ్వరాలు ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. తెలంగాణ లో ఇన్ని రోజులు డెంగ్యూ ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్న సంగతి తెలిసిందే. డెంగ్యూ జ్వరాలతో ప్రజలు ఆస్పత్రులకు క్యూ కట్టారు. అయితే ఇప్పుడు తెలంగాణ లో డెంగ్యూ తగ్గి మలేరియా మరియు జ్వరాలు పెరిగిపోయాయని ఆరోగ్య అధికారులు చెబుతున్నారు. తాజాగా హైదరాబాద్ ఫీవర్ ఆస్పత్రి సూపరిడెంట్ డాక్టర్ శంకర్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ లో డెంగ్యూ కేసులు తగ్గుముఖం పట్టాయని చెప్పారు.

అంతే కాకుండా మలేరియా మరియు జ్వరాలు పెరుగుతున్నాయని చెప్పారు. సెప్టెంబర్ 1 నుండి ఇప్పటి వరకూ కేవలం 40 డెంగ్యూ కేసులు నమోదయ్యాయని చెప్పారు. ఇక ప్రతి రోజూ 4 నుండి 5 మలేరియా కేసులు వస్తున్నాయని చెప్పారు. ప్రజలు ఇంట్లోకి దోమలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి అని సూచించారు. అయితే డెంగ్యూ కేసులు తగ్గటం మాత్రం కాస్త ఊరట కలిగించే విషయం అని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news