మెగాస్టార్ చేతుల మీదుగా “రిపబ్లిక్” ట్రైలర్

-

మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ హీరోగా ప్రస్థానం ఫేమ్ దేవా కట్టా డైరక్షన్ లో వస్తున్న సినిమా రిపబ్లిక్. మరోసారి పొలిటికల్ బ్యాక్ డ్రాప్ మూవీతో వస్తున్న దేవా కట్టా ఈ సినిమాతో మరోసారి తన సత్తా చాటాలని చూస్తున్నాడు. రాజకీయ పార్టీలు వాటి పవర్ మీద హీరో క్యారక్టర్ తో ప్రశ్నిస్తూ.. మార్పు తెచ్చేలా చేసే ప్రయత్నంగా ఈ రిపబ్లిక్ వస్తుంది. ఇక లేటెస్ట్ గా ఈ సినిమా ట్రైలర్‌ రిలీజైంది.

ఈ సినిమా ట్రైలర్‌ ను స్వయంగా మెగాస్టార్‌ చిరంజీవి లాంచ్‌ చేశారు. ”సాయి ధరమ్‌ తేజ్‌ త్వరగా కోలుకుంటున్నాడు. అతని కోరిక మేరకు రిపబ్లిక్‌ అక్టోబర్‌ 1 వ తేదీన విడుదల అవుతుంది. మీ ఆదరణ, అభిమానం, ప్రేమే సాయి ధరమ్‌ తేజ్‌ కు శ్రీ రామ రక్ష” అని మెగాస్టార్‌ చిరంజీవి ట్వీట్‌ చేశారు. కాగా.. ఈ సినిమాలో ఐశ్వర్య రాజేశ్‌, జగపతి బాబు, రమ్యకృష్ణ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news