“పెళ్లి సందD” ట్రైలర్ లాంచ్‌ చేసిన మహేష్

టాలీవుడ్‌ టాప్‌ డైరెక్టర్‌  రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన పెళ్లి సందడి సినిమా ఎలాంటి విజయం సాధించిందో తెలిసిందే. ఇక ఈ సినిమా కు సీక్వెల్ గా పెళ్లి సందడి సినిమాలో హీరోగా నటించిన శ్రీకాంత్ కుమారుడితో పెళ్ళి సందD చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా కు రాఘవేంద్ర రావు దర్శకేంద్ర పర్యవేక్షణ చేస్తున్నారు. గౌరీ రోనంకి సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

సినిమాలో రోషన్ కు జంటగా శ్రీలీల హీరోయిన్ గా నటించింది. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ విడుదలైంది. ఈ ట్రైలర్‌ ను స్వయంగా ప్రిన్స్‌ మహేష్‌ బాబు లాంఛ్‌ చేశారు. ఈ సినిమా పూర్తిగా ఫ్యామిలీ కథాంశంగా తెరకెక్కుతున్నట్లు ఈ ట్రైలర్‌ చూస్తే అర్థమవుతుంది. పల్లె టూరి వాతావరణంలో ఈ సినిమా తెరక్కెక్కించినట్లు మనకు అర్థమౌతుంది. ఇక ఈ ట్రైలర్‌ లో రాఘవేద్రరావు కనిపించి…. అందరిని కనివిందు చేశాడు. ఇక శ్రీకాంత్ తనయుడు రోషన్ తన యాక్టింగ్‌ తో రెచ్చిపోయాడు. కాగా.. శ్రీకాంత్ పెళ్లి సందడి సినిమా ఇండస్ట్రీ లో సూపర్ హిట్ గా నిలిచింది. మరి రోషన్ పెళ్లి సందD ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి.