ఇవే నా చివరి ఎన్నికలు: మల్లారెడ్డి

-

తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల సమయం కావడంతో ప్రచారాల హోరు చాలా ఎక్కువగా ఉంది. ఉన్న వారం సమయాన్ని సరిగా వాడుకుని ఎన్నికలలో విజయావకాశాలను మెరుగుపర్చుకోవాలని అందరూ ప్రయత్నిస్తున్నారు. కాగా BRS లో ప్రస్తుతం మంత్రిగా ఉన్న సీనియర్ లీడర్ మల్లారెడ్డి మేడ్చల్ లో పర్యటిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈయన మాట్లాడుతూ మొదటగా ఈ ఎన్నికల్లో అసలు పోటీ చేయడం వద్దని అనుకున్నట్లు చెప్పారు. కానీ ఈ జిల్లాలో మా ప్రభుత్వంలో చేయగా ఇంకా మిగిలిపోయిన అభివృద్ధిని చేయడానికి నా నిర్ణయాన్ని మార్చుకుని మీ కోసం పోటీ చేస్తున్నట్లు మల్లారెడ్డి ప్రజలతో చెప్పారు. మరో వారంలో జరగనున్న ఎన్నికలలో గెలిచి మేడ్చల్ ను మరింతగా అభివృద్ధి చేసి రాష్ట్రంలో నెంబర్. 1 సిటీ గా చేస్తానంటూ మల్లారెడ్డి మాటిచ్చారు.

ఈ జిల్లాలో ఎంతోమంది స్థానిక నాయకులను తయారుచేశానంటూ చెప్పుకొచ్చారు మల్లారెడ్డి.. ఇవి నా చివరి ఎన్నికలు కావడంతో మేడ్చల్ అభివృద్ధి కోసం నన్ను గెలిపించండి అంటూ చెప్పారు మల్లారెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version