BIG ALERT :రేపటి నుండి “ది వాక్సిన్ వార్”

-

ప్రతివారం కూడా ఓటిటి లలో సినిమాలు, వెబ్ సిరీస్ లు విడుదల ప్రేక్షకులకు సరికొత్త వినోదాన్ని పంచిపెడుతున్నాయి. అందుకే గురువారం శుక్రవారం వస్తే చాలు ఏ ఓటిటి లో ఏమేమి సినిమాలు వస్తాయని కళ్ళు కాయలు కాచేలా ఎదరుచూస్తుంటారు ఆడియన్స్. అదే విధంగా ఈ వారంలో కొన్ని వెబ్ సిరీస్ లు మరియు సినిమాలు వివిధ ఓటిటి ఛానెళ్లలో విడుదల అవుతున్నాయి. ఇక తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం బాలీవుడ్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి తెరకెక్కించిన ది వాక్సిన్ వార్ సినిమా ఓటిటిలో విడుదల కానుంది. వివేక్ అగ్నిహోత్రి డైరెక్ట్ చేసిన ది కాశ్మీరీ ఫైల్స్ ఎంతటి ఘనవిజయాన్ని అందుకుందో మనము చూశాము. అందుకే ఈ సినిమా పై ప్రేక్షకులు చాలా అంచనాలను పెట్టుకుని ఎదురుచూస్తున్నారు.

ఇక ఈ సినిమా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో రేపటి నుండి స్ట్రీమింగ్ కానుందని అధికారికంగా తెలుస్తోంది. అయితే ప్రస్తుతానికి ది వాక్సిన్ వార్ కేవలం హిందీ బాషలోనే అందుబాటులో ఉందట.

Read more RELATED
Recommended to you

Exit mobile version