నేడు లోక్‌సభలో ప్రవేశపెట్టనున్న ట్రిపుల్ తలాక్ బిల్లును తాము పూర్తిగా వ్యతిరేకిస్తామని కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారు. ఖర్గే గురువారం ఏర్పాటు చేసిన విలేకరులతో మాట్లాడుతూ.. ట్రిపుల్ తలాక్ బిల్లుపై నిర్వహించే చర్చలో సభ్యులం పాల్గొంటామన్నారు. దీంతో తమ అభిప్రాయాన్ని బలంగా ముందుకు తీసుకెళ్తామని చెప్పారు. ఏళ్ల తరబడి కొనసాగుతున్న మతపరమైన అంశాల్లో జోక్యం చేసుకోకూడదని ప్రభుత్వానికి ఆయన విజ్ఞప్తి చేశారు.
తలాక్ విధానం చెల్లదని సుప్రీం కోర్టు వివరించినపటికీ భాజపా ప్రభత్వం దీనిపై బిల్లు తీసుకురావడం వెనుక ఉన్న ఉద్దేశాన్ని ఆయన ప్రశ్నించారు. ఎన్నడు లేని విధంగా భాజపా హయాంలో మత పరమైన అనేక అంశాలను చాప కింద నీరుల వ్యాప్తిచెందిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.