సిఎం కెసిఆర్ కు మల్లు భట్టి విక్రమార్క బహిరంగ లేఖ

-

పోడు రైతులకు హక్కు పత్రాలు ఇవ్వాలని కోరుతూ….సిఎం కెసిఆర్ కు మల్లు భట్టి విక్రమార్క బహిరంగ లేఖ రాశారు. తెలంగాణలోని ప్రజా సమస్యలు తెలుసుకోవడమే లక్ష్యంగా నేను మార్చి 16న ‘పీపుల్స్‌ మార్చ్‌’ పాదయాత్రను ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ప్రారంభించిన విషయం మీకు విధితమే. ఆదివాసులు, గిరిజనులు అధికంగా నివసించే ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాతోపాటు, ఖమ్మం, వరంగల్‌, నల్గొండ తదితర జిల్లాలో కూడా పోడుభూముల సమస్యతో గిరిజనులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారన్నారు.

పీపుల్స్‌పల్స్‌ పాదయాత్రలో అనేక మంది గిరిజనులు వచ్చి పోడుభూముల సమస్యను నా వద్ద ప్రస్తావించారు. ప్రజాసంక్షేమం, గిరిజనాభివృద్ధే ధ్యేయంగా పనిచేసే కాంగ్రెస్‌పార్టీ గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావాల్సిన బాధ్యత మా పైన
ఉంది. అందులో భాగంగానే ఈ లేఖ మీకు రాయడం జరుగుతోంది. 2014 లో మీరు అధికారపగ్గాలు చేపట్టిన తరువాత, మీరు, రాష్ట్ర మంత్రులు, ప్రభుత్వ అధికారులు పలుమార్లు చేసిన ప్రకటనలతో పోడు హక్కు పత్రాలు అందుతాయని వేలాది మంది గిరిజనులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. మీరు, మీ ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలు నీటిమీద రాతలుగానే మిగిలిపోయాయని తెలిపారు మల్లు భట్టి విక్రమార్క.

పాదయత్రలో గిరిజన రైతులు అడుగడుగున ఈ సమస్యను నా దృష్టికి తెచ్చారు. రెవెన్యూ, అటవీ శాఖల మధ్య సమన్వయం లోపంతోపాటు ప్రభుత్వ వైఖరి చూస్తుంటే బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం లబ్దిదారులకు హక్కు పత్రాలు అందజేయడంపై కప్పదాటు వైఖరి అవలంభిస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఈ సమస్యపై గతంలో అమాయక గిరిజన రైతులు, ప్రభుత్వాధికారుల మధ్య పలుమార్లు ఘర్షణలు జరిగినా రైతుల ప్రభుత్వమని చెప్పుకునే మీరు క్షేత్రస్థాయిలో పరిస్థితులను పట్టించుకోకుండా గిరిజనులను వంచించడమేనని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news