మేమంతా కలిసి బీజేపీని గద్దె దించుతాం : మమతా బెనర్జీ

-

వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీని ఎలాగైనా గద్దె దించాలని ప్రతిపక్షాలు వ్యూహం రచిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రతిపక్షాలు, ప్రాంతీయ పార్టీలు ఐక్యతారాగం వినిపిస్తున్నాయి. మొన్నటి వరకు కేసీఆర్, నిన్న బిహార్ సీఎం నితీశ్, ఇవాళ బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రాంతీయ పార్టీలన్నీ ఏకమై మోదీని గద్దె దించాలన్న నినాదాన్ని బలంగా వినిపిస్తున్నారు.

2024 ఎన్నికల్లో కలిసికట్టుగా భాజపాను ఎదుర్కోవాలని ప్రయత్నిస్తున్న జేడీయూ అధినేత, బిహార్​ సీఎం నీతీశ్​ కుమార్​కు బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తోడయ్యారు. ప్రతిపక్షాలన్నీ కలిసి వచ్చే సాధారణ ఎన్నికల్లో భాజపాను గద్దెదించుతాయని దీదీ అన్నారు. ఇందుకోసం పొరుగురాష్ట్రాలైన బిహార్​, ఝార్ఖండ్​ ముఖ్యమంత్రులు సహా ఇతర విపక్ష పార్టీలతో కలిసి పోరాడతామని స్పష్టం చేశారు మమతా బెనర్జీ.

కోల్​కతాలో తృణమూల్​ కాంగ్రెస్​ గురువారం నిర్వహించిన ఓ కార్యక్రమానికి హాజరైన సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు. భాజపా అహంకారం, ప్రజల ఆగ్రహం రెండూ భాజపాను తుదముట్టిస్తాయని అన్నారు.

”నేను, నీతీశ్​ కుమార్​, హేమంత్​ సోరెన్​.. ఇంకా చాలా మంది 2024 ఎన్నికల్లో కలిసి పోరాడతాం. భాజపాను ఓడించాలంటే అన్ని ప్రతిపక్ష పార్టీలు ఏకం కావాలి. మనమంతా ఓ వైపు.. భాజపా మరోవైపు ఉంటుంది. 300 సీట్లు ఉన్నాయన్న అహంకారమే భాజపాకు శత్రువుగా మారుతుంది. 2024లో అసలైన ఆట(ఖేలా హోబే) ఆరంభం అవుతుంది.”

– మమతా బెనర్జీ, బంగాల్​ ముఖ్యమంత్రి

Read more RELATED
Recommended to you

Exit mobile version