ప్రస్తుతం బిగ్ బాస్ సిక్స్ చాలా గ్రాండ్ గా ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా ఒక్కొక్క కంటెస్టెంట్ నుండి కొన్ని కొన్ని విషయాలు బయటకు వస్తూ ఉండడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ క్రమంలోనే ఒక బిగ్ బాస్ కంటెస్టెంట్ కి సంబంధించిన ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది.. ఇకపోతే ఎప్పటికంటే ఈసారి భిన్నంగా బిగ్ బాస్ హౌస్ లోకి ఏకంగా 21 మంది కంటెస్టెంట్లు పాల్గొనగా అందులో ఒకరు బాలాదిత్య.. ఇక ఈ సీజన్ విన్నర్ గా బాలాదిత్య నిలిచే అవకాశం ఉందని కొంతమంది నెటిజన్లు సోషల్ మీడియా ద్వారా కామెంట్లు చేస్తున్నారు.. ఇదిలా ఉండగా బాలాదిత్య బిగ్ బాస్ షోకి వెళ్ళకముందు ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇవ్వగా.. అందులో కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
ఇకపోతే ఆయన మాట్లాడుతూ.. లవ్ స్టోరీలు అంటే ఉంటాయి కదండీ.. చిన్నచిన్న లవ్ క్రష్ లు అంటూ బాలాదిత్య చెప్పుకొచ్చారు. కాలేజ్ చదివే సమయంలో ఒక అమ్మాయి పై పాట కూడా రాశానని , ఆ విధంగా చాలామందిని చూసి ఇన్స్పైర్ అయ్యి పాటలు రాయడం జరిగింది అని ఆయన వెల్లడించారు. ఇక భయంకరమైన లవ్ స్టోరీలు మాత్రం తన జీవితంలో జరగలేదు అని చెప్పుకొచ్చారు.. ఇక మా ఫ్రెండ్ ఒక అమ్మాయి పూణే వెళ్ళిపోయి, అట్నుంచి యూఎస్ వెళ్ళిపోయింది. అలా స్నేహితురాలు దూరమైన సమయంలో బాదేసి కొన్ని పాటలు రాసి ఉంటాను అంటూ బాలాదిత్య తెలిపారు.
ఇకపోతే 2016 ఆగస్టు 7వ తేదీన వైజాగ్ కు చెందిన మానస లక్ష్మి అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు. ఇక అప్పటికే తనకు తొమ్మిది పెళ్లిచూపులు జరిగిపోయాయి అంట . ఇక పెళ్లి చూపులకి వెళ్ళినప్పుడు.. ప్రతి అమ్మాయి మళ్లీ సినిమాలు చేస్తావా అని అడిగే వారని బాలాదిత్య చెప్పుకొచ్చారు.. సినిమాలు చేయడం ఏమంత తప్పో నాకు అర్థం కావడం లేదు అంటూ ఆయన కామెంట్లు చేశారు. ఇకపోతే ఫ్యాషన్ తో ట్రావెల్ చేసే వాళ్ళు అంటే తనకు చాలా ఇష్టమని, ఇక తనకు కాబోయే భార్య అని కూడా తెలిపారు బాలాదిత్య. బాలాదిత్య చేసిన కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.