ఉత్తరప్రదేశ్ లోని హత్రాస్ లో జరిగిన ఘటన దేశ వ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక అన్ని పార్టీలు హత్రాస్ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ యోగి సర్కారుపై విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇక ఇటీవల హత్రాస్ లో జరిగిన ఘటనకు వ్యతిరేకంగా పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోల్కత్త లో రోడ్డెక్కి మరి నిరసన ర్యాలీ చేపట్టారు. మూడు కిలోమీటర్ల వరకు ర్యాలీ చేపట్టిన మమతాబెనర్జీ… బిజెపి దళిత వర్గాన్ని ఓట్లు అడిగేటప్పుడు బుజ్జగించి ఆ తర్వాత మాత్రం చిత్రహింసలకు గురి చేస్తోంది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు మమతాబెనర్జీ.
అంతేకాకుండా ఓట్లు అడిగేందుకు బీజేపీ నేతలు దళితుల ఇళ్లకు వెళ్లి… అక్కడ దళితులు వండుకున్నది తినకుండా బయటికి నుంచి తెచ్చుకున్న ఆహారాన్ని తిని వారిని అవమానిస్తూ ఉంటారు అంటూ ఆరోపించారు మమతా బెనర్జీ. ఇంత దారుణమైన ఘటన జరిగినప్పటికి ప్రభుత్వం ఇంకా సరైన చర్యలు చేపట్టకపోవడం… బిజెపి ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనం మమతాబెనర్జీ నిప్పులు చెరిగారు.