టిఆర్ఎస్ అధినేత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శనివారం ఫోన్ చేశారు. ఈనెల 15న ఢిల్లీలో పలు రాజకీయ పార్టీల నేతలతో తృణముల్ కాంగ్రెస్ నిర్వహించనున్న సమావేశానికి రావాలని ఈ సందర్భంగా కెసిఆర్ ను దీదీ ఆహ్వానించారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఇటు బిజెపి, అటు కాంగ్రెస్ పార్టీలకు ప్రత్యామ్నాయంగా తృతీయ కూటమిని ఏర్పాటు చేసే దిశగా మమతాబెనర్జీ ప్రణాళికలు రచిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే ఢిల్లీలో నిర్వహించనున్న సమావేశానికి రావాలంటూ పలు పార్టీలకు చెందిన 22 మంది జాతీయ స్థాయి నేతలకు దీదీ ఆహ్వానాలు పంపారు. ఇందులో భాగంగానే కేసీఆర్ కు దీదీ ఫోన్ చేశారు. ఈ సమావేశంలో త్వరలో జరగనున్న రాష్ట్రపతి ఎన్నికపై కీలక చర్చ జరగనున్నట్లు సమాచారం.ఈ సమావేశానికి హాజరు కానున్న 22 మంది జాతీయ స్థాయి నేతలు వీరే.
1. అరవింద్ కేజ్రీవాల్ (ముఖ్యమంత్రి, ఢిల్లీ)
2. పినరయి విజయన్ (ముఖ్యమంత్రి, కేరళ)
3. నవీన్ పట్నాయక్ (ముఖ్యమంత్రి, ఒడిశా)
4. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (ముఖ్యమంత్రి, తెలంగాణ)
5. తిరు MK స్టాలిన్ (ముఖ్యమంత్రి, తమిళనాడు)
6. ఉద్ధవ్ థాకరే (ముఖ్యమంత్రి, మహారాష్ట్ర)
7. హేమంత్ సోరెన్ (ముఖ్యమంత్రి, జార్ఖండ్)
8. భగవంత్ సింగ్ మాన్ (ముఖ్యమంత్రి, పంజాబ్)
9. సోనియా గాంధీ (ప్రెసిడెంట్, INC)
10. లాలూ ప్రసాద్ యాదవ్ (అధ్యక్షుడు, RJD)
11. డి. రాజా (ప్రధాన కార్యదర్శి, సిపిఐ)
12. సీతారాం ఏచూరి (ప్రధాన కార్యదర్శి, CPIM)
13. అఖిలేష్ యాదవ్ (అధ్యక్షుడు, సమాజ్ వాదీ పార్టీ)
14. శరద్ పవార్ (అధ్యక్షుడు, NCP)
15. జయంత్ చౌదరి (జాతీయ అధ్యక్షుడు, RLD)
16. H. D. కుమారస్వామి (కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి)
17. H. D. దేవెగౌడ (MP, భారతదేశ మాజీ ప్రధాని)
18. ఫరూక్ అబ్దుల్లా (అధ్యక్షుడు, JKNC)
19. మెహబూబా ముఫ్తీ (అధ్యక్షుడు, PDP)
20. S. సుఖ్‌బీర్ సింగ్ బాదల్ (అధ్యక్షుడు, శిరోమణి అకాలీదళ్)
21. పవన్ చామ్లింగ్ (అధ్యక్షుడు, సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్)
22. K. M. కాదర్ మొహిదీన్ (అధ్యక్షుడు, IUML)