ఒడిశా రాష్ట్రంలో జరిగిన రైలు ప్రమాదానికి కారణం అది ఇది అంటూ ఏవేవో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కానీ ఇది అని స్పష్టంగా ఎవరూ చెప్పలేకపోవడం ఇక్కడ గమనించాలి. ఇక ఈ ప్రమాదంపై సిబిఐ విచారణ చేపట్టాలని రైల్వే శాఖ మంత్రి ఇచ్చిన స్టేట్మెంట్ ను పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తప్పు బట్టారు. ఈ విషయంపై మమతా కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రమాదాన్ని ప్రమాదంగా మాత్రమే చూడాలని.. కానీ దీనిని కూడా కేంద్రం తమ స్వార్ధాలకు వాడుకుని రాజకీయం చేయాలని ప్రయత్నిస్తోందంటూ మమతా ఆరోపించింది. అంతే కాకుండా ఇప్పటి వరకు ఈ ప్రమాదంలో మరణించిన వారి సంఖ్యను 275 గా ప్రకటించింది, కానీ ఇందులో కూడా నాకు అనుమానం ఉందని మమతా కామెంట్ చేసింది.
మాములుగా సిబిఐ ఇప్పటి వరకు చూసుకుంటే క్రిమినల్ కేసుల్లోనే యాక్టీవ్ గా వర్క్ చేస్తుందని… ఇలా ప్రమాదాలకు సిబిఐ విచారణ ఏమిటంటూ కేంద్రాన్ని ప్రశ్నిస్తోంది ? మరి చివరకు కేంద్రం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.