పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ మూడోసారి వరుసగా సిఎం అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. ఇక ఆమె ఎమ్మెల్యేగా ఓడిపోయే అవకాశం ఉందని భావించినా సరే నందిగ్రాం లో దూకుడుగా ముందుకు వెళ్తున్నారు మమత. ముందు సువెందు అధికారి 8 వేలకు పైగా లీడింగ్ లో ఉండగా ఇప్పుడు ఆ లీడ్ 3 వేల వరకు పడిపోయింది. దీనితో మమత భారీగానే పుంజుకున్నట్టు కనపడుతుంది.
మమతా బెనర్జీ సిఎంగా విజయం సాధించే సూచనలు బలంగా కనపడినా ఎమ్మెల్యేగా ఆమె ఓడిపోయే అవకాశం ఉందని అంచనాలు వేసారు. అనూహ్యంగా మమత నిలబడ్డారు. ఇక వామపక్షాలు బెంగాల్ లో పూర్తిగా తమ పట్టు కోల్పోయిన పరిస్థితి కనపడుతుంది. అక్కడ కేవలం ఒక్క స్థానంలో మాత్రమే వామపక్షాలు లీడ్ లో ఉన్నాయి.