ప్రముఖ సింగర్ కు వేధింపులు…అశ్లీల వీడియోలు పెట్టి మరీ !

ప్రముఖ గాయనిని వేధిస్తున్న వ్యక్తి అరెస్ట్ అయ్యాడు. సింగర్‌ పేరుతో సోషల్ మీడియాలో అకౌంట్ ఓపెన్ చేసిన నిందితుడు… గాయని పై యూట్యూబ్ ఛానల్ లో అశ్లీల కంటెంట్ అప్లోడ్ చేశాడు. ఫేస్ బుక్, ఇన్ స్టా లో సైతం గాయని పేరుతో ఖాతా ఓపెన్ చేశాడు. గాయని ఫోటోతో ఫిల్మ్ ప్రొడక్షన్ మొదలు పెట్టాడు నిందితుడు. ఈ విషయం తెలియగానే ఆ సింగర్ కుటుంబం షాక్ కు గురైంది.

దీంతో నిందితుడికి ఫోన్ చేసి సోషల్ ఖాతాలు తొలగించాలని కోరింది సింగర్. తాను చేసే పనులకు ఎన్ఓసి ఇవ్వాలని సింగర్ ను వేదింపులకు గురి చేశాడు నిందితుడు.

వేధింపులు ఎక్కువ కావడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది సింగర్‌. ఆ సింగర్ ఫిర్యాదు తో నిందితుడు మేడికాయల నవీన్ కుమార్ ను అరెస్ట్ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ నిందితుడు నవీన్ స్వ గ్రామం కర్ణాటక రాష్ట్రంలోని బలగాన్ హళ్లి అని తెలుస్తోంది. అయితే… నిందితుడు నవీన్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు రాచకొండ పోలీసులు.