బొద్దింకను చూస్తేనే చాలు.. కొందరు ఒళ్లు జలదరించినట్లు ఫీలవుతారు. వెంటనే దూరంగా పారిపోతారు. కొందరు వాటిని చంపేదాకా వదలరు. బొద్దింకలు అనేవి ఇళ్లలో సహజమే. అయితే ఆ వ్యక్తి మాత్రం గాయబడిన బొద్దింకను చూసి జాలి పడ్డాడు. దానికి చికిత్స అందించడం కోసం వెటర్నరీ హాస్పిటల్‌కు తీసుకెళ్లాడు. ఈ సంఘటన థాయ్‌లాండ్‌లో చోటు చేసుకుంది.
డాక్టర్ థాను లింపపట్టనవానిక్ వద్దకు ఓ వ్యక్తి వచ్చాడు. అతను ఓ గాయపడ్డ ఓ బొద్దింకను ఆ డాక్టర్ వద్దకు తీసుకొచ్చాడు. దీంతో మొదటి డాక్టర్ థానుకు ఆశ్చర్యం కలిగింది. కానీ బొద్దింకకు చికిత్స చేసేందు అంగీకరించాడు. ఈ క్రమంలోనే అక్కడి సై రాక్ అనే జంతువుల హాస్పిటల్‌కు ఆ బొద్దింకను తీసుకెళ్లారు.
కాగా ఈ సంఘటన గురించి డాక్టర్ థాను తన ఫేస్‌బుక్ ఖాతాలో పోస్టు పెట్టాడు. బొద్దింక బతికేందుకు 50/50 చాన్స్ ఉందన్నారు. కొందరికి ఇది జోక్‌లా అనిపించవచ్చు. కానీ బొద్దింకను తీసుకువచ్చిన ఆ వ్యక్తిని చూస్తే సీరియస్ అలా అనిపించింది. అతను దాన్ని ఎలాగైనా బతికించాలనే పట్టుదలతో ఉన్నాడు.. అని డాక్టర్ థాను తెలిపాడు.
అయితే బొద్దింకకు చికిత్స అందించినందుకు డాక్టర్ థాను ఫీజు ఏమీ తీసుకోలేదు. ఇక ఆ బొద్దింక బతికిందా, లేదా అనే వివరాలు కూడా తెలియవు. కానీ ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.