ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలి దీక్ష..అవమానం తట్టుకోలేక ఆత్మహత్య..!

ప్రియుడు మోసం చేశాడంటూ ఓ యువతి అతని ఇంటి ముందు మౌన పోరాటం చేసింది. నెల రోజులపాటు దీక్ష చేసి ఆ తరవాత పోలీసులకు ఫిర్యాదు చేసింది. యువకుడిపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టించి జైలుకు పంపింది. దాంతో యువకునితోపాటు అతని కుటుంబ సభ్యులు కూడా జైలుకు వెళ్లారు. ఇక ఇటీవల యువకుడు జైలు నుండి బయటకు రాగా తీవ్ర మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ములుగు పట్టణంలో చోటు చేసుకుంది.సి

సాయి సూర్య అనే యువకుడు తన అన్నతో కలిసి ములుగులో జిరాక్స్ సెంటర్ నిర్వహించేవాడు. ఈ క్రమంలో బండారుపల్లి కి చెందిన ఓ యువతితో పరిచయం ఏర్పడింది. అయితే తనను ప్రేమించి మోసం చేశాడని సదరు యువతి అతడి ఇంటి ముందు దీక్షకు దిగింది. దాంతో అతడిని పోలీసులు అరెస్ట్ చేసి ఇటీవల విడిచి పెట్టగా తీవ్ర మనస్థాపానికి గురై తన చావుకు ఆ యువతి కారణమంటూ సాయి సూర్య లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు.