టీఆర్ఎస్ ఆవిర్భవించాక ఏ ఎన్నికల్లో ఎక్కువ కష్టపడిందో తెలియదు గానీ….ఇప్పుడు హుజూరాబాద్ ఉపఎన్నికలో మాత్రం నానా కష్టాలు పడుతుంది. ఒక్క ఈటల రాజేందర్‌ని ఓడించడానికి కిందా మీదా పడుతుంది. అసలు ఎప్పుడైతే ఈటల..టిఆర్‌ఎస్‌కు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారో అప్పటినుంచి…టిఆర్‌ఎస్.. రాష్ట్రాన్ని వదిలేసి కేవలం హుజూరాబాద్‌పైనే ఫోకస్ చేసింది.
రాజకీయంగా…ఆర్ధికంగా, సామాజికంగా…ఇలా ఎన్ని రకాలుగా హుజూరాబాద్ ప్రజలని ఆకర్షించాలో అన్నీ రకాల ప్రయత్నాలు చేసింది…కానీ ఏది చేసిన ప్రజలు ఈటల వైపే ఉన్నారని మాత్రం బాగా క్లారిటీ ఉంది. అందుకే ఎన్నికల రోజు వరకు ఈటలకు చెక్ పెట్టడానికే టిఆర్‌ఎస్ ప్రయత్నిస్తుంది…తాజాగా బీజేపీ పార్టీ అభ్యర్థి ఈటల హుజురాబాద్‌లో ఓటర్లకు డబ్బులు పంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని టిఆర్‌ఎస్…రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఈటల అక్రమాలపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని, తక్షణమే ఆయనపై చర్యలు తీసుకోవాలని టిఆర్ఎస్ నేతలు క్రాంతి కిరణ్, శ్రీనివాస్ రెడ్డిలు డిమాండ్ చేశారు.
ఇక డబ్బులు పంపిణీ గురించి కారు పార్టీ ఫిర్యాదు చేయడం కాస్త కామెడీగానే ఉందని చెప్పాలి. ఎందుకంటే టిఆర్‌ఎస్ హుజూరాబాద్‌లో ఏం చేస్తుందో…అక్కడి ప్రజలకు తెలుసు. కాబట్టి కారు ఫీట్లు పెద్దగా వర్కౌట్ అవ్వవు. అటు వస్తే ప్రచారంలో టిఆర్‌ఎస్ తరుపున ఎంతమంది నాయకులు హుజూరాబాద్ వచ్చి ప్రచారం చేస్తున్నారో చెప్పాల్సిన పని లేదు. రాష్ట్రంలోని టిఆర్‌ఎస్ నేతలంతా అక్కడే ఉన్నట్లు కనిపిస్తున్నారు.
ఈ క్రమంలోనే టిటిడిపి మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత టిఆర్‌ఎస్ నేత ఎల్. రమణ సైతం హుజూరాబాద్ వచ్చి ప్రచారం చేస్తున్నారు. తన సొంత వర్గం పద్మశాలిల ఓట్లు ఆకట్టుకునేందుకు రమణ వచ్చారు. ఈ క్రమంలోనే పద్మశాలిలని బిజేపి, ఈటల మోసం చేశారని, చేనేత కార్మికులకు అన్యాయం చేశారని, కేసిఆర్ బాగా న్యాయం చేశారనే విధంగా మాట్లాడారు. కానీ రమణ ఎంత ప్రచారం చేసినా నో బెనిఫిట్ అని చెప్పొచ్చు. అవుట్‌డేటెడ్‌గా ఉన్న రమణ వల్ల టిఆర్‌ఎస్‌కు నాలుగు ఓట్లు కూడా పడవు. అసలు హుజూరాబాద్‌లోని పద్మశాలిలు సైతం ఈటల వైపే ఎక్కువ మొగ్గు చూపుతున్నారని తెలుస్తోంది. ఆయనే ఎమ్మెల్యేగా ఫిట్ అని భావించే పరిస్తితి ఉంది.