
అప్పటి వరకు ఆ ఫ్యామిలీ చాలా సంతోషంగా ఉంది. కానీ.. క్షణాల్లో ఆ ఇంట్లో రోదనలు మిన్నంటాయి. క్షణాల వ్యవధిలో కొడుకు, తండ్రి చనిపోవడంతో ఆ ప్రాంతమంతా రోదనలతో దద్దరిల్లింది. ఈ ఘటన కోయంబత్తూరులో చోటు చేసుకున్నది. కూతురుతో ఆటాడుకుంటున్న తండ్రి తన రెండేళ్ల కొడుకును మరిచిపోయాడు. ఇంతలో కొడుకు ఎక్కడికెళ్లాడని వెతుకుతుండగా.. నీళ్లసంపులో విగతజీవిగా కనిపించాడు కొడుకు. ఇప్పటి వరకు ఆడుతూ పాడుతూ తిరిగిన కన్న కొడుకు కళ్ల ముందే మృత్యువాత పడటంతో తట్టుకోలేని ఆ తండ్రి వెంటనే పైకి వెళ్లి తన రూమ్‌లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఓ వైపు కొడుకు, మరోవైపు భర్తను పోగొట్టుకున్న ఆ తల్లి ఏడుపును చూసి అక్కడికి వచ్చిన వారు కన్నీటి పర్యంతమయ్యారు.