మద్యం కోసం సరిహద్దులు దాటి పోలీసులకు దొరికేసాడు…!

-

కిక్ ఎక్కి దాదాపు 40 రోజులు దాటేసింది. దీనితో జనాలకు ఇప్పుడు మైండ్ పని చేయడం లేదు మద్యం అమ్మకాలు ఎప్పుడు మొదలుపెడతారు అంటూ ఎంతగానో ఎదురు చూస్తున్నారు ఇప్పుడు. ఇప్పుడు తెలంగాణా మినహా దాదాపు అన్ని రాష్ట్రాల్లో మద్యం అమ్మకాలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీనితో మద్యం కోసం జనాలు బారులు తీరే పరిస్థితి వచ్చింది. తాజాగా ఒక సంఘటన జరిగింది.

ఏమీ లేదు… తెలంగాణా ఆంధ్రా సరిహద్దుల్లో ఒక యువకుడు మద్యం కోసం బోర్డర్ దాటాడు. ఖమ్మం జిల్లాలో ఈ సంఘటన జరిగింది. బోర్డర్ దాటే ప్రయత్నం చేయగా పోలీసులు అతన్ని గుర్తించారు. అతని సోదరుడు మద్యం కోసం ఏపీ సరిహద్దుల్లో ఉన్న షాప్ కి వెళ్ళాడు. మద్యం తీసుకుని వస్తుండగా అతన్ని అతని సోదరుడుని పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకుని మద్యం లాక్కున్నారు. పారిపోయే ప్రయత్నం చేయగా…

ఇద్దరిలో ఒకరిని పట్టుకుని… హోం క్వారంటైన్ లో ఉండాలని ఆదేశాలు ఇచ్చారు. ఏపీ సరిహద్దుల్లో ఎవరిని అనుమతించవద్దు అని సిఎం కేసీఆర్ పక్కా ఆదేశాలు ఇవ్వడంతో అటు నుంచి ఇటు ఎవరు వచ్చినా సరే పోలీసులు క్షమించడం లేదు. అందులో భాగంగానే సదరు యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి మీద కేసులు కూడా నమోదు చేసినట్టు తెలుస్తుంది. అలాగే మొబైల్ ఫోన్ కూడా లాక్కుని పంపించారట. ఒకరు తప్పించుకుని ఇంటికి చేరుకోగా, ఇద్దరినీ హోం క్వారంటైన్ లో ఉండాలని ఇంటి నుంచి బయటకు రావొద్దు అని హెచ్చరించారట పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news