విజయ్ దేవరకొండ సినిమాల లిస్ట్ ఏంటి ఇలా ఉంది …!

-

టాలీవుడ్ లో రౌడీ హీరోగా పాపులర్ అయిన విజయ్ దేవరకొండ హిట్ ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. రీసెంట్ గా వరల్డ్ ఫేమస్ లవర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విజయ్ దేవరకొండ మళ్ళీ నిరాశ పరచాడు. అయినా వెంటనే పూరి జగన్నాధ్ తెరకెక్కించే సినిమాలో నటించేందుకు సిద్దం అయ్యాడు. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది.

 

ఇక ఈ సినిమా తర్వాత నిన్ను కోరి, మజిలీ చిత్రాల దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించబోయో సినిమాలో నటిస్తాడు. వాస్తవంగా ఈ సినిమా పూరి జగన్నాధ్ సినిమా కంటే ముందే మొదలవ్వాల్సింది. కాని డియ కామ్రేడ్ ఫ్లాప్ తో డైలమాలో పడ్డ విజయ్ దేవరకొండ ఇస్మార్ట్ శంకర్ తో భారీ సక్సస్ అందుకున్న పూరి జగన్నాధ్ తో సినిమాకి కమిటయ్యాడు. ఈ సినిమా కంప్లీట్ చేసి శివ నిర్వాణ తో సెట్స్ మీదకి వస్తాడు.

ఇక మరో రెండు సినిమాలు రెడీగా ఉన్నాయి… దిల్ రాజు నిర్మాతగా విజయ్ దేవరకొండ ఒక సినిమాలో నటించడానికి ఇంతకముందే డేట్స్ ఇచ్చి ఉన్నాడు. శివ నిర్వాణ సినిమా అయిపోగానే ఈ సినిమా చేస్తాడట. అంతేకాదు అర్జున్ రెడ్డి కాంబో మళ్ళీ రిపీట్ కానుందట. ఇప్పటికే అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కూడా విజయ్ దేవరకొండ కి ఒక కథ చెప్పి ఒప్పించాడు. ఈ మూడు సినిమాలు అయిపోగానే సందీప్ రెడ్డి వంగా సినిమాలో నటిసాడని లేటెస్ట్ న్యూస్. మొత్తానికి విజయ్ దేవరకొండ సినిమా లిస్ట్ బాగానే ఉందని అన్ని మంచి ప్రాజెక్ట్స్ అని చెప్పుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news