మనిషా… బకాసురుడా… గంటలో ఎంత ఆహారం తిన్నాడంటే?

-

మనలో ఆహారం విషయంలో ఒక్కొక్కరి అభిప్రాయాలు, ఆలోచనలు ఒక్కో విధంగా ఉంటాయి. మనలో కొందరు లావుగా కనిపించినా తక్కువ ఆహారమే తీసుకుంటూ ఉంటారు. మరికొందరు సన్నగా కనిపించినా కుంభాలకు కుంభాలు ఆహారం తీసుకుంటూ ఉంటారు. అయితే తాజాగా ఒక యువకుడు మాత్రం ఒక హోటల్ లో వండిన ఆహారమంతా తినేశాడు. ఆ యువకుడు కేవలం గంట సమయంలోనే హోటల్ లో వండిన ఆహారాన్ని తినేయడం గమనార్హం.

పూర్తి వివరాల్లోకి వెళితే యూకేలోని సుందర్‌ల్యాండ్ ప్రాంతానికి చెందిన 22 సంవత్సరాల కైల్ గిబ్సన్ బ్రిటీష్ ఈటింగ్ లీగ్‌లో కొన్ని రోజుల క్రితం ఉత్తీర్ణుడయ్యాడు. ఒక ఛారిటీకి విరాళాలు అందించాలనే సదుద్దేశంతో కైల్ వినూత్నమైన ఆలోచనతో ముందుకొచ్చాడు. ఆ ఛాలెంజ్ ప్రకారం కైల్ గంటల్లోపే హోటల్ లో వండిన ఆహారాన్నంతా లాగించేయాలి. ఛాలెంజ్ ప్రకారం యువకుడు రెస్టారెంటు మెనులో ఉన్న అన్ని రకాల వంటకాలను 61 నిమిషాల్లో తినేశాడు.

రెండు మిల్క్ షేక్ లు, మూడు శాండ్ విచ్ లు, రెండు కప్పులు ఫ్రెంచ్ ఫ్రైస్, నాలుగు హాట్ డాగ్స్, ఎనిమిది బర్గర్లను గంటలోపే వేగంగా తినేశాడు. అయితే ఛాలెంజ్ ను సక్సెస్ ఫుల్ గా పూర్తి చేయడంతో అతను 400 పౌండ్ల విరాళాన్ని సంపాదించగలిగాడు. మన దేశ కరెన్సీ ప్రకారం 39,123 రూపాయలను తక్కువ్ సమయంలోనే కైల్ సంపాదించగలిగాడు. ఆహారం తిన్న వీ కైల్ యూట్యూబ్ లో పోస్ట్ చేయగా ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. గంట సమయంలో 13 వేల కేలరీల ఫుడ్ ను భుజించడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Latest news