అందుకే నేను ప్లాస్మా డొనేట్ చేయలేదు : రాజ‌మౌళి..!

-

ప్రపంచం మొత్తాన్ని కుదిపేస్తున్న కరోనా మహమ్మారి ప్రభావం అన్నీ రంగాలపై అధికంగానే ఉంది. సినీ ఇండస్ట్రీ పైన కూడా అదే రేంజ్ లో ఉందని చెప్పాలి.. ఇప్పటికే చాలా మంది సినీ ప్రముఖులు కరోనా బారిన పడ్డారు.. దర్శకుడు రాజమౌళికి కూడా కరోనా సోకిన సంగతి తెలిసిందే. అయనతో పాటుగా అయన కుటుంబం మొత్తానికి కరోనా సోకింది. అలాగే కీర‌వాణి కుటంబానికి కూడా క‌రోనా సోకింది. అయితే ప్ర‌స్తుతం అందరూ కోలుకుని క్షేమంగా ఉన్నారు. కరోనా నుంచి కోలుకున్న తర్వాత ప్లాస్మా దానం చేస్తానని రాజమౌళి ట్వీట్ చేశారు.

rajamouli
 

అయితే తాజాగా.. ఈ రోజు కీర‌వాణి, ఆయ‌న కుమారుడు ప్లాస్మాను దానం చేయ‌గా, రాజ‌మౌళి మాత్రం చేయ‌లేదు. దానిపై ఆయన స్పందిస్తూ.. యాంటీ బాడీస్‌ కోసం పరీక్ష చేయించుకోగా ఐజీజీ లెవల్స్‌ 8.62 ఉన్నాయని, ప్లాస్మా దానం చేయాలంటే 15కన్నా ఎక్కువ ఉండాలని తెలిపారు. పెద్దన్న కీరవాణి, భైరవ మంగళవారం ఉదయం ప్లాస్మా దానం చేశారని జక్కన్న పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news