సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ను పొట్టన పెట్టుకున్న కోతి

-

హైదరాబాద్‌ కూకట్‌పల్లిలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఒక కోతి సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ని పొట్టన పెట్టుకుంది. కోతిని బెదరగొట్టేందుకు ప్రయత్నించి ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ప్రాణాలు కోల్పోయాడు. ఘటనకు సంబందించిన పూర్తీ వివరాల్లోకి వెళ్తే కూకట్‌పల్లి జయనగర్‌ లో నివాసం ఉంటున్న లోకేశ్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్నాడు. కరోనా లాక్‌డౌన్ విధించిన సమయం నుంచి ఇంటి వద్ద నుంచే విధులు నిర్వర్తిస్తున్నాడు.

మంగళవారం మధ్యాహ్నం రెండో ఫ్లోర్‌లో ఉన్న తన ఇంట్లోకి కోతులు రావడం గమనించాడు లోకేశ్. కోతులు ఇంట్లోకి ప్రవేశించకుండా వాటిని బెదరగొట్టడానికి గాను చేతికి దొరికిన ఇనుప రాడ్డుతో వాటిని అక్కడి నుంచి తరిమేయడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలోనే లోకేశ్ చేతిలో ఉన్న ఇనుపరాడ్‌ ప్రమాద వశాత్తు రోడ్డు మెడ ఉన్న విద్యుత్ వైర్లకు తగిలి షాక్ కొట్టింది. గిల గిలా కొట్టుకుంటూ లోకేశ్ పడిపోయాడు. ఇది గమనించి కుటుంబ సభ్యులు వెంటనే లోకేశ్‌ను సమీపంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రికి చేరుకునేలోపే లోకేశ్ ప్రాణాలు కోల్పోయాడు.  

Read more RELATED
Recommended to you

Exit mobile version