వావ్; ఎలా అయినా పెళ్లి చేసుకోవాలని, ఏం చేసాడో చూడండి…!

-

ఈ లాక్ డౌన్ ఏమో గాని పాపం పెళ్లి చేసుకోవాలి అనుకున్న వాళ్ళు మాత్రం బాగా ఇబ్బంది పడుతున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఇప్పుడు బాగా నరకం చూస్తున్నారు. ఇక పెళ్లి కుదిరిన వాళ్ళు మళ్ళీ లాక్ డౌన్ తర్వాత కుదిరే అవకాశం లేదు అనుకున్నారో ఏమో ఇప్పుడే ఏదోక కష్టం పడి పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యారు. ఇలాగే పెళ్లి చేసుకున్నాడు మధ్యప్రదేశ్ లో ఒక యువకుడు.

important days for house warming and marriages, functions in magha masam 2019

ఛతర్‌పూర్ జిల్లాలోని నౌగావ్‌ కి చెందిన సునీల్ అహిర్‌వార్ కు ఏప్రిల్ 28 న వివాహం జరగాలి. కాని లాక్ డౌన్ కారణంగా పెళ్లి ఆగిపోయింది. ఎం చెయ్యాలో అర్ధం కాని ఒక యువకుడు ఒంటరిగానే పెళ్లి చేసుకోవాలి అని ఒక నిర్ణయానికి వచ్చాడు. ఒంటరిగా వెళ్లి పెళ్లి చేసుకోవాలని భావించాడు అతను. పెళ్ళికొడుకుగా రెడీ అయిపోయాడు. దుస్తులు ధరించి, తలపై తలపాగా పెట్టుకుని, బైక్ పై వధువు ఇంటికి ఒక్కడే వెళ్ళిపోయాడు.

ముఖానికి మాస్క్ కూడా పెట్టుకున్నాడు. అతనిని చూసి అత్తామామలు కూడా ఆశ్చర్యపోయారు. పెళ్లి కుమార్తె ను తన బైక్ మీద ఎక్కించుకుని, తన ఇంటికి తీసుకుని వెళ్ళాడు. గరౌలి అవుట్‌పోస్ట్ పోలీసులు వారిని ఆపగా, వారికి అసలు విషయం చెప్పేసాడు. దీనితో వారు పెళ్లి చేసుకోవడానికి అనుమతి ఇవ్వడంతో జాగ్రత్తగా ఇంటికి తీసుకొచ్చి పెళ్లి చేసుకున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news