కరోనా ఏమో గాని జనాల్లో మానవత్వం అనేది దాదాపుగా చచ్చిపోయింది అనే మాట అక్షరాలా నిజం. రోజు రోజుకి కరోనా భయాలు జనాల్లో తీవ్రంగా ఉండటం తో ఇప్పుడు ఎవరిని నమ్మలేని పరిస్థితిలో ఉన్నారు. కళ్ళ ముందు ఎవరు అయినా చనిపోతున్నా సరే వాళ్లకు సహాయం చేయడానికి కూడా ముందుకు రావడం లేదు. అది ఎవరి తప్పు కాకపోయినా ఇప్పుడు మాత్రం కొన్ని ఆందోళనకర సంఘటనలు జరుగుతున్నాయి.
వలస కూలీల పరిస్థితి దారుణంగా ఉంది. వాళ్ళను ఆదుకునే నాధుడు ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడా కనపడటం లేదు. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా సరే పెద్దగా ఫలితం మాత్రం ఉండటం లేదు అనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. తాజాగా ఒక దారుణ సంఘటన జరిగింది. బెంగళూరు లో పని చేసే ఒక యువకుడు పని లేక నడిచి ఇంటికి రావాలి అనుకున్నాడు. అక్కడి నుంచి బయల్దేరి…
చిత్తూరు జిల్లాకు చేరుకున్నాడు… కాని అక్కడికి వచ్చే సరికి అనారోగ్యం తో అతను ప్రాణాలు కోల్పోగా కోన ఊపిరితో ఉండగా చూసిన వాళ్ళు కూడా సహాయం చేయడానికి ముందుకు రాలేదు. దీనితో అతను అక్కడే ప్రాణాలు కోల్పోయాడు. కరోనాతో చనిపోయాడు అని భయపడ్డారు. పోలీసులకు సమాచారం ఇవ్వగా రెండు రోజుల క్రితం మరణించిన ఆ యువకుడ్ని తీసుకుని వెళ్లి కరోనా పరిక్షలు నిర్వహించారు. అతనికి కరోనా లేదని తేల్చారు.