తప్పతాగి హోర్డింగ్‌కు ఉరి వేసుకునే యత్నం

-

సిద్దిపేట ముస్తాబాద్‌ చౌరస్తాలో ఓ వ్యక్తి తప్పతాగి హల్​చల్ చేశాడు. బుధవారం సాయంత్రం 6 గంటల సమయంలో మద్యం మత్తులో విభాగిని మధ్య ఉన్న హోర్డింగ్‌ ఎక్కి ఆత్మహత్యాయత్నం చేశాడు. మెడకు తాడు కట్టుకొని హోర్డింగ్‌కు వేలాడుతూ రోడ్డుపై వెళ్లేవారిని భయపెట్టాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడకు చేరుకుని.. హోర్డింగ్‌కు వేలాడుతున్న అతడికి దిగువన ఓ పాఠశాల బస్సును నిలిపారు.

మెడకు తాడుతోనే అతడు బస్సు పైకి దూకగా.. వాహనం ఉండటంతో తాడు బిగుసుకోలేదు. ప్రాణాపాయం తప్పింది. ఆ వ్యక్తిని సిద్దిపేట అర్బన్‌ మండలం చిన్నగుండవెల్లి గ్రామానికి చెందిన జి.కొమురయ్య అలియాస్‌ కుమార్‌గా గుర్తించారు. గత నెల 31న ఇదే తరహాలో అతను ఆత్మహత్యాయత్నం చేసినట్లు పోలీసులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news