సంక్రాతి పండుగ సందడి షురూ అయ్యిపోయింది. సంక్రాతి అంటేనే అందరు సొంత ఊర్లు వెళ్ళిపోతూ వుంటారు. అందుకోసమే ప్రయాణికుల సౌకర్యార్థం భారతీయ రైల్వే మార్పులు చేస్తోంది. ఇక పూర్తి వివరాలని చూస్తే వందే భారత్, సెమీ-హై స్పీడ్ రైలు కూడా దేశంలో స్టార్ట్ అయ్యాయి.
ప్రయాణం సుఖవంతంగా ఉండేందుకు ఇప్పుడు ప్రయాణికులకు బెర్త్‌లను మార్చుకునే ఫెసిలిటీ ని రైల్వే శాఖ కల్పిస్తోంది. ఇప్పుడు ప్రయాణికులు వారి బెర్త్ నచ్చకపోతే దానిని మధ్యలో అప్‌గ్రేడ్ చేసేయచ్చు. ఒకవేళ మీరు స్లీపర్ కి బుక్ చేసుకుని మార్చుకోవాలంటే రైల్వే సౌకర్యం ద్వారా ప్రయాణంలోనే మీ సీటును ఏసీ కోచ్‌గా అప్గ్రేడ్ చేసేందుకు అవుతుంది. మరి ఇక ఈ ఫెసిలిటీ ని ఎలా పొందొచ్చు అనేది ఇప్పుడు చూసేద్దాం. ప్రయాణీకుల సౌకర్యాన్ని దృష్టి లో ఉంచుకుని భారతీయ రైల్వే టికెట్ బుకింగ్ నిబంధనలను ఈజీ గా మార్చేసింది.
మీ కోచ్‌ని అప్‌గ్రేడ్ చేయాలనుకుంటే.. ఏ బూత్‌కు వెళ్ళక్కర్లేదు. మీరు ట్రావెలింగ్ టైం లోనే మార్చుకోవచ్చు.
మీ సీటు స్లీపర్ కోచ్‌లో ఉండి మీరు ఎసి కి మారాలంటే కోచ్‌లో ఉన్న TTEని సంప్రదించండి.
టీటీఈకి మీ ఇబ్బందిని చెప్పి ఏసీ కోచ్‌లో సీటు ఖాళీగా ఉంటే ఆ బెర్త్ ని ఇమ్మని చెప్పండి.
మీరు నిబంధనల ప్రకారం TTEకి సూచించిన నగదును చెల్లించాలి. అయితే ఈ ఫెసిలిటీ ని పొందాలంటే మరొక కోచ్‌లో బెర్త్ ఖాళీగా ఉండాలి. అప్పుడు మాత్రమే మీరు సీట్ అప్‌గ్రేడ్ అవుతుంది.