2019″కి ఎన్నో ఆశలతో అడుగు పెట్టి ఉంటారు కదూ…? రోజులు అన్నీ ఒక లానే ఉన్నా, ఈ ఏడాది మనకు ఏదో కలిసి వస్తుందనే ఒక పిచ్చి నమ్మకంతో స్వాగతం పలికి ఉంటారు కదూ…? సరే గాని ఈ ఏడాది మీరు అనుకున్నవి సాధించారా…? మీరు పెట్టుకున్న లక్ష్యాలు చేధించారా…? ఏమో సాధించారో లేదో మీకే తెలియాలి. సాధించిన వాడు కాలాన్ని పొగుడుతాడు, సాధించలేని వాడు కాలాన్ని తిడతాడు. మన బలాలు, మన లోపాలు మనకు తెలియవు కాబట్టి మనకు కళ్ళ ముందు కనపడేది కాలమే. అంటే గడిచిన రోజులే.
2019 అయిపోయింది కదా, 2020లోకి అడుగు పెడుతున్నాం కదూ, ఈ ఏడాది కూడా ఎన్నో లక్ష్యాలతో, ఎన్నో ఆశలతో, ఎన్నో కోరికలతో, మరెన్నో ఆశయాలతో ఉంటుందిగా మరి. ఇక్కడ మీకు “మనలోకం” ఒక విషయం చెప్తుంది. కాలం అనేది మారుతూ ఉంటుంది. నీకు కలిసి వచ్చినా కలిసి రాకపోయినా గడియారంలో ముళ్ళు, క్యాలెండర్ లో తేదీ వాటి పని అవి చేస్తాయి. ఆ విషయాన్ని నువ్వు బలంగా నమ్మితే నీకంటూ అది నిజమైన బలం. ఎందుకంటే కాలాన్ని నిందించే చాలా మంది బలహీనులే కాబట్టి.
‘మనలోకం’ మీకు ఇచ్చే సలహా ఏంటీ అంటే… మీకు మీరు చేసే పనులు కలిసి రావాలి అంటే మీలో సమర్ధత ఉండాలి, బలహీనతలు అధిగమించాలి. అవన్నీ మీరు నమ్మే కాలంలో అధిగమించాలని మనలోకం, మనస్పూర్తిగా ఆకాంక్షిస్తుంది. విజ్ఞాలు తొలగిపోవాలని, వేసే ప్రతి అడుగు మీకు ఒక కొత్త అనుభూతితో పాటు మంచి శకునాలను అందించాలని, కాలాన్ని నమ్ముతున్నారు కాబట్టి ఆ కాలం ఇచ్చేవాటిని కూడా నిందించకుండా మనస్పూర్తిగా స్వీకరించాలని, నూతన ఏడాది సరికొత్త ఆనందాలు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము.
ఇక మా విషయానికి వస్తే, ‘మనలోకం’ నుంచి మీకు నచ్చ వచ్చు, నచ్చకపోవచ్చు. అలాగే మేము రాబోయే ఏడాదిలో కూడా మీకు విలువైన సమాచారాన్ని, వినోదాన్ని, సలహాలను, సూచనలను ఇస్తామని, మీ జీవితంలో మా సలహాలు, సమాచారం ఏదోక సమయంలో ఉపయోగపడతాయని ఆశిస్తున్నాం.
మీకోసం సరికొత్త విషయాలను అందించే ప్రయత్నం మాత్రం ఎల్లప్పుడు చేస్తాం. మమ్మల్ని ఆశీర్వదించాలని, మా అడుగులకు మీ తోడు ఉండాలని కోరుతూ…మనలోకం టీం.
ఒక్క విషయం మర్చిపోవద్దు. మారాల్సింది కాలం కాదు మనం.