గుడ్ న్యూస్‌: దిగొచ్చిన బంగారం ధర.. వెండి మాత్రం..

-

బంగారం ధరలు రోజుకు ఒకల ఉంటున్నాయి. ఎప్పుడు ఎలా పెరుగుతాయో.. ఎలా తగ్గుతాయో తెలియటం లేదు. ఇక ఈ రోజు పసిడి ధర మళ్లీ తగ్గింది. హైదరాబాద్ మార్కెట్‌లో బుధవారం బంగారం ధర తగ్గింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.50 దిగొచ్చింది. దీంతో బంగారం ధర రూ.37,220కు తగ్గింది. అదేసమయంలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.10 తగ్గుదలతో రూ.40,660కు క్షీణించింది. బంగారం ధర తగ్గితే వెండి ధర మాత్రం పైకి కదిలింది. కేజీ వెండి ధర రూ.50 పెరిగింది. దీంతో ధర రూ.49,350కు పెరిగింది.

ఢిల్లీ మార్కెట్‌లో మాత్రం బంగారం ధర నిలకడగా కొనసాగింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలో ఎలాంటి మార్పు లేదు. రూ.38,050 వద్దనే ఉంది. అదే స‌మ‌యంలో 24 క్యారెట్ల బంగారం ధర కూడా స్థిరంగానే రూ.39,250 వద్దనే కొనసాగుతోంది. కానీ కేజీ వెండి ధర కూడా రూ.50 పెరిగింది. దీంతో ధర రూ.49,350కు చేరింది.

Read more RELATED
Recommended to you

Latest news