తెలంగాణ ప్రభుత్వానికి మంచు లక్ష్మీ లేఖ.. ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు సిద్ధం అంటూ…

-

మంచు లక్ష్మీ తెలంగాణ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించింది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న మన ఊరు- మన బడి ప్రోగ్రామ్ చాలా బాగుందని ప్రశంసించింది. అయితే డిజిటల్ ఎడ్యుకేషన్ లో భాగంగా ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ట్రైనర్లతో విద్యార్థులకు శిక్షణ ఇప్పిస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయని సూచించింది. ఆ దిశగా ప్రభుత్వం దృష్టి సారించాలని రిక్వెస్ట్ చేసింది. తాను కూడా ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేసింది.

ఇటీవల కాలంల పలువురు సినీ ప్రముఖులు తెలంగాణ పథకాలను ప్రశంసిస్తున్నారు. తెలంగాణ తీసుకున్న పలు నిర్ణయాలపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇటీవల టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ ను కేసీఆర్ తెలంగాణకు ఆహ్వానించడంపై విజయ్ దేవరకొండ, నిఖిల్ వంటి వారు కేటీఆర్ పై ప్రశంసలు కురిపించారు. తెలంగాణలో టికెట్ రేట్లను పెంచడంపై అప్పట్లో మెగాస్టార్ చిరంజీవితో పాటు ఇండస్ట్రీ పెద్దలు స్వాగతించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని కొనియాడారు.

Read more RELATED
Recommended to you

Latest news