మీ రాజీనామాలు మమ్మ‌ల్ని ఆప‌లేవు…. మంచు విష్ణు షాకింగ్ కామెంట్స్..!

ఒక గేమ్ ఆడిన‌ప్పుడు విన్న‌ర్ అనేది ఒక‌రే ఉంటారు. ర‌న్న‌ర్ ఒక‌రు ఉంటారు. లూస‌ర్ ఎవ‌రూ ఉండ‌ర‌ని అన్నారు. మేము గెలిచాం అవ‌త‌లి పాన‌ల్ వాళ్లు స‌హ‌క‌రించాల‌ని.. మరో ప్యాన‌ల్ నుండి గెలిచిన వాళ్లు కొంత మంది రాజీనామా చేశార‌ని అది అనుకోకుండా జ‌రిగిపోయింద‌ని అన్నారు. అదే విధంగా రాజీనామా చేసినా తాము ముందుకు వెళ‌తామ‌ని మంచు విష్ణు వ్యాఖ్యానించారు. మా ఇంకా ధృడంగా ఉంటుంద‌ని అదేవిధంగా ముందుకు వెళుతుంద‌న్నారు. ఇక‌పై తాను జ‌ర‌గ‌బోయే ప‌నుల గురించి మాట్లాడుతాన‌ని కానీ ఇక పై తాము మా ఎన్నిక‌ల గురించి మీడియాకు ఎక్క‌మ‌ని విష్ణు వ్యాఖ్యానించారు.

ఇంత కాలం మా ఎన్నిక‌ల‌తో కూడా ప్రేక్ష‌కును ఎంట‌ర్టైన్ చేశామ‌ని చెప్పారు. వేరే దేశాల‌లో ఉన్న వాళ్లు కూడా త‌న‌కు ఫోన్ చేసి త‌న‌ను విష్ చేశార‌ని చెప్పారు. మోహ‌న్ బాబు కొడుకుగా మీ విష్ణుగా రెండు సంవ‌త్స‌రాలు మాకు ఏం చేయాలో అది చేస్తాన‌ని చెప్పారు. మా కు 24 క్రాఫ్ట్స్ స‌హాయం కావాల‌ని అన్నారు. ఎంతో మంది ప్రేక్ష‌కులు త‌న గెలుపు కోసం గుడుల‌కు వెళ్లి పూజ‌లు చేశార‌ని వారికి కూడా కృత‌జ్ఞ‌త‌లు అని విష్ణు వ్యాఖ్యానించారు.