CM Jagan : కార్పొరేషన్లకు కొత్త ఛైర్మన్‌ల ఎంపికకు కసరత్తు చేస్తున్నారు సీఎం జగన్. ఏకంగా 100 మందికి అవకాశం కల్పించనున్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో 100కు పైగా కార్పొరేషన్లకు చైర్మన్ల పదవీకాలం ముగిసింది. వీరి స్థానంలో కొత్తవారిని నియమించడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇవాళ పార్టీ ముఖ్య నేతలతో సీఎం జగన్ సమావేశం కానున్నారు. ఈ భేటీలోనే 100కు కార్పొరేషన్ల చైర్మన్లను, అటు టీటీడీ బోర్డు మెంబర్ తుది జాబితాను సీఎం జగన్ ఖరారు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
మెజారిటీ ఛైర్మన్లకు కొనసాగింపు ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఇచ్చిన హామీలు, ఇతర సమీకరణాలకు అనుగుణంగా కొన్ని మార్పులు ఉండే అవకాశం ఉంది. ఛైర్మన్ల ప్రకటన తర్వాత డైరెక్టర్ల ఎంపిక పై కసరత్తు ఉంటుందట. ఇది ఇలా ఉండగా, గన్నవరం వైసీపీ నేత యర్లగడ్డ వెంకట్రావు ఇవాళ ముఖ్య అనుచరులతో భేటీ కానున్నారు. ఈ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కొంతకాలంగా యార్లగడ్డ తీరుపై అధిష్టానం అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. పార్టీలో ఉండలేనివారు వెళ్లిపోవచ్చని ఇటీవల యార్లగడ్డకు సజ్జల కౌంటర్ ఇచ్చారు. గన్నవరం నుంచి పోటీ చేస్తానని సజ్జల స్పష్టం చేయడంతో… లోకేష్ సమక్షంలో టిడిపిలో చేరుతానని ప్రచారం సాగుతోంది.