ముసలి కోటా..వాడు మనిషే కాదు జంతువు.. నాగబాబు సంచలనం..!

-

మా ఎన్నికల్లో కోట శ్రీనివాసరావు తన మద్దతును మంచు విష్ణు కు ప్రకటించిన సంగతి తెలిసిందే. అంతే కాకుండా ప్రకాష్ రాజ్ నాన్ లోకల్ అని ప్రకాష్ తో తాను 15 సినిమాల్లో నటించానని..ఒక్క సినిమా షూటింగ్ కు కూడా సమయానికి రాడని వ్యాఖ్యానించారు. అయితే ఈ విషయంపై తాజాగా నాగ బాబు ఓ ఇంటర్వ్యూ లో ఆగ్రహం వ్యక్తం చేశారు. ముసలి కోటా అతనికి వయసు అయిపోయింది… చాలా కాలం నుండి ఆయన అవాకులు చెవాకులు వింటున్నానని అన్నారు.

కోట శ్రీనివాసరావు కొడుకును పోగొట్టుకున్నప్పుడు చాలా సింపతీ చూపించామని అన్నారు. కోట శ్రీనివాసరావు కు బుద్ధి జ్ఞానం ఏమీ లేదని అసలు వాడు మనిషే కాదు. అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కోట శ్రీనివాసరావు జంతువు అంటూ నాగ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు కోట ఏం మనిషి ప్రకాష్ రాజ్ ను పట్టుకొని అన్ని మాటలు అంటాడా… వేరే భాషల వాళ్లు పోటీ చేయకూడదా…? కోట అన్ని భాషల్లో నటిస్తాడా..? అంటూ వ్యాఖ్యానించారు.

కోట శ్రీనివాసరావు సంకుచితంగా మాట్లాడుతున్నారని.. తమ ఏరియాలో కి వేరే వాళ్లు రావద్దు అనే సంకుచిత భావంతో ఉన్నాడని వ్యాఖ్యానించారు. బాబు మోహన్ కు కూడా మెచ్యూరిటీ పోయిందని నాగబాబు మండి పడ్డారు. కోటా శ్రీనివాసరావు గట్టిగా మాట్లాడలేడు.. కూర్చో లేడు ఏం మనిషి చాలా తప్పు అంటూ నాగబాబు ఫైరయ్యారు. ఇక నాగబాబు నాగబాబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో సంచలనంగా మారాయి. ఇండస్ట్రీ లో ఒక సీనియర్ నటుడిని పట్టుకుని వాడు వీడు అంటూ సంబోధిస్తారా..నాగబాబు కోటా శ్రీనివాస్ కు క్షమాపణలు చెప్పాలి అంటూ పలువురు నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.

https://youtu.be/ZJB7iIxer4I

Read more RELATED
Recommended to you

Latest news