డేటింగ్ యాప్, మొబైల్ లోన్స్, మ్యాట్రిమొనీ నేరాలపై పోలీసులతో హీరో మంచు విష్ణు చేసిన ఇంటర్వ్యూ..

-

సైబర్ క్రైమ్.. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ నేరాలు పెరుగుతున్నాయి. కొత్త కొత్త రకాలుగా నేరాలు చేసి, వాటి నుండి తప్పించుకుంటున్నారు. చేతిలో మొబైల్ ఫోన్ ఉంటే సరిపోదు, దాన్ని ఏ విధంగా వాడాలో తెలియాలి. ఇది నాకు తెలియదు, అందుకే అలా జరిగింది అనడానికి లేదు. మోసగాళ్ళు సినిమా రిలీజ్ ప్రమోషన్లలో భాగంగా సైబర్ క్రైమ్ నేరాలపై అవగాహన కలిగించడానికి హీరో మంచు విష్ణు, పోలీసులతో చేసిన ఇంటర్వ్యూలోని కొన్ని ఆసక్తికరమైన విషయాలు..

డేటింగ్ యాప్:

ఇందులో కనిపించేదంతా నిజం కాదు. అవతలి వ్యక్తి అపోజిట్ సెక్స్ అనుకుంటే పొరపాటే. ముఖ్యంగా మగవాళ్ళు, ఆడవాళ్ళతో మాట్లాడుతున్నామన్న భ్రమలో ఉంటారు. కానీ అది నిజం కాదు. వీడీయో కాల్ మాట్లాడినా, అమ్మాయిలా కనిపించే ఫిల్టర్స్ వచ్చేసాయి. కాబట్టి మోసపోయే ఛాన్స్ ఎక్కువ. అదీ గాక ఈ యాప్స్ చాలా మటుకు ప్లే స్టోర్లో కనిపించవు. వాటికి బానిస అయిన ఒక డాక్టర్ 30లక్షల వరకు పోగొట్టుకున్నాడు.

మొబైల్ లోన్స్..

ఎలాంటి వెరిఫికేషన్ లేకుండా 5వేలు, 10వేలు లోన్ ఇచ్చేస్తుంటారు. 5వేల లోన్ తీసుకుంటే వారిచ్చేది కేవలం 3వేల రూపాయలే. అదీ వారానికి. అంటే దీనర్థం, ఇక్కడ వడ్దీ రేటు 300శాతం ఉంటుంది. ఒకవేళ అది మీరు చెల్లించకపోతే మీ వాట్సాప్ నంబర్ గ్రూపుల్లో మీ గురించి అసభ్యకరమైన రాతలు, మార్ఫింగ్ చేసిన ఫోటోలు పంపిస్తారు. మొబైల్ లోన్స్ తీసుకున్న యువత ఆత్మహత్య చేసుకోవడానికి ఇదే కారణం. యాప్ ద్వారా లోన్ తీసుకుంటున్నారంటే మీ మొబైల్ సమాచారం మొత్తం వారి చేతుల్లోకి వెళ్ళిపోతుంది.

మ్యాట్రిమొనీ నేరాలు

ఒంటరి మహిళ, ఒంటరి మగాళ్ళని బాగా ఆకర్షిస్తుంటారు. హై క్లాస్ ప్రొఫైల్ పెట్టి రిజిస్ట్రేషన్ కోసం లక్షలు లక్షలు కట్టించుకుంటారు. యూకే, యుఎస్ సంబంధాలని చెప్పి ట్రాప్ చేస్తారు. మంచి సంబంధం అని అనుకుని, భ్రమ పడితే మొదటికే మోసం వచ్చేస్తుంది.

ఓఎల్ఎక్స్

కొత్త వాహనాన్ని చాలా తక్కువ ధరకే అమ్ముతున్నాం అంటూ యాడ్ పెడతారు. మేము మిలటరీ వాళ్లమని, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, మిలటరీ కార్డ్, ఆధార్ కార్డ్ అన్నీ చూపెడతారు. లక్ష రూపాయల వాహనం 20వేలకే వస్తుందన్న ఆశతో ఆకర్షితులవుతే మొదటికే మోసం వచ్చేస్తుంది.

దాదాపుగా ఇలాంటి నేరాలన్నీ చైనా, నైజీరియా, హాంకాంగ్ వాళ్ళే చేస్తున్నారు. ఇవన్నీ అక్కడి నుండే జరుగుతున్నవి. దేశవ్యాప్తంగా సంవత్సర కాలంలో లక్షకోట్లకి పైగా స్కామ్స్ జరుగుతున్నాయి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version