“మా” సభ్యులకు మంచు విష్ణు గుడ్ న్యూస్.. .. ఆస్పత్రుల్లో 50 శాతం రాయితీ

-

మా ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు, టాలీవుడ్ యంగ్ హీరో మంచు విష్ణు మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. మా ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులు ఆరోగ్యంపై మంచు విష్ణు దృష్టిసారించారు. ఇందులో భాగంగానే తాజాగా అపోలో, కిమ్స్, మెడి కవర్, aig, సన్ షైన్ ఆస్పత్రుల తో మా అసోసియేషన్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు మంచి విష్ణు కీలక ప్రకటన చేశారు.

ఈ ఆస్పత్రుల్లో 50 శాతం రాయితీపై గోపి కన్సల్టేషన్ తో పాటు అత్యవసర పరిస్థితుల్లో ఉచిత సౌకర్యం కూడా కల్పించనున్నట్లు మంచు విష్ణు స్పష్టం చేశారు. అసోసియేషన్ లో ఉన్న సభ్యులందరికీ దశలవారీగా ఆరోగ్య పరీక్షలు చేస్తామని ఆయన ప్రకటన చేశారు. ముందు ముందు ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తానని హామీ ఇచ్చారు మంజు విష్ణు. అక్టోబర్ మాసం లో జరిగిన మా ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో… ప్రకాష్ రాజు ప్యానల్ పై మంచు విష్ణు ప్యానల్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news