మంద కృష్ణకు తీవ్ర గాయాలు.. ఆస్పత్రిలో చేరిక

-

ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ కి తీవ్ర గాయాలు అయ్యాయి. ఢిల్లీలోని ఓ ప్రైవేట్ హోటల్లో బాత్రూంలో జారిపడ్డరు మందకృష్ణ మాదిగ. ఈ నేపథ్యంలోనే.. మందకృష్ణ మాదిగ కి తీవ్ర గాయాలైనట్లు సమాచారం అందుతోంది.

అయితే ఈ విషయం తెలుసుకున్న కేంద్ర పర్యాటక మంత్రి కిషన్ రెడ్డి.. ఢిల్లీలోని ఆ ప్రైవేట్ హోటల్ వద్దకు చేరుకున్నారని సమాచారం అందుతోంది. అక్కడి కి చేరుకున్న కేంద్ర పర్యాటక మంత్రి కిషన్ రెడ్డి.. వెంటనే ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో మందకృష్ణ మాదిగను చేర్పించారు.

దగ్గర ఉండి.. మందకృష్ణ మాదిగ కు అపోలో ఆసుపత్రిలో వైద్యం అందేలా చూస్తున్నారు కేంద్ర పర్యాటక మంత్రి కిషన్ రెడ్డి. ఇక ప్రస్తుతం మందకృష్ణ మాదిగ ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో వైద్యం తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు వివరించారు అపోలో ఆసుపత్రి వైద్యులు. చిన్న చిన్న గాయాలు మినహా ఆయన పరిస్థితి మెరుగ్గానే ఉందని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news