ఎన్నో ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత భారత్ ఒలింపిక్ ఛాంపియన్‌గా నిలిచింది. టోక్యోలో శనివారం జరిగిన పురుషుల జావెలిన్ త్రో ఫైనల్‌లో నీరజ్ చోప్రా వంద కోట్ల మంది ప్రజల ప్రార్థనలకు సమాధానమిచ్చాడు. పానిపట్‌లో జన్మించిన నీరజ్ చోప్రా ఒలంపిక్స్ లో గోల్డ్ మెడల్ గెలవడంతో అందరూ అతనిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ క్రమంలోనే అతనికి అనేక అవార్డులు, రివార్డులు వరదలా వస్తున్నాయి.
ఇక గతంలో నీరజ్ చోప్రా డ్యాన్స్ చేసిన ఓ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. గత 24 గంటల్లోనే ఆ వీడియోను చాలా మంది వీక్షించారు. రీట్వీట్లు, లైక్ చేశారు. పాత వీడియో అయినప్పటికీ అది ప్రస్తుతం వైరల్ అవుతోంది.
Neeraj Chopra can shake a leg too besides throwing Javelin to #Olympics #Gold limits 👏😹#NeerajChopra #goldmedal #NeerajGoldChopra pic.twitter.com/7ii3oqAUiQ
— Rosy (@rose_k01) August 7, 2021
చోప్రా ఒలంపిక్స్ ఫైనల్‌లో తన మొదటి త్రో నుండే దూకుడు కొనసాగించాడు. ఈవెంట్ పురోగమిస్తున్నప్పుడు ఎవరూ చేరుకోలేని 87.58 మీటర్ల మార్క్‌ను చేరుకున్నాడు. దాన్ని అతను తన రెండవ త్రో లో సాధించాడు. ఇక అతను తిరిగి వెనుదిరిగి చూడలేదు. ఒలంపిక్స్ చాంపియన్ అయ్యాడు. ఈ సందర్భంగా నీరజ్ తన బంగారు పతకాన్ని లెజెండరీ స్ప్రింటర్ మిల్కా సింగ్ కు అంకితం ఇచ్చాడు. అయితే ఫ్యాన్స్ మాత్రం నీరజ్ పాత వీడియోను చూసి ఎంజాయ్ చేస్తున్నారు.