అమరావతి భూములు కుంభకోణం : వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే సంచలన ఆరోపణలు

-

అమరావతి భూముల కుంభకోణంపై వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే ఆళ్ల రామకృష్ణారెడ్డి.. అధికారులపై సంచలన ఆరోపణలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో రాజధాని భూముల్లో పీఓఏ, పీఓటీ యాక్టులను ఉల్లంఘించి దళితుల భూములను కాజేశారని… చంద్రబాబు, నారాయణ అధికారులు కలిసి పేదల భూములను భయపెట్టి లాక్కొన్నారని ఫైర్‌ అయ్యారు. సీఆర్డీఏ పరిధిలోని దళితులను చంద్రబాబు.. ఆయన సహచరులు ఏ విధంగా బెదిరించారో వీడియోల రూపంలోనే బయటకొచ్చాయని.. భూమిపుత్ర రియల్ ఎస్టేట్ సంస్ధకు చెందిన బ్రహ్మానంద రెడ్డి అనే వ్యక్తి బెదిరించి దళిత భూములను లాక్కొన్నారని ఆరోపించారు.

అసైన్డ్ భూములు ప్రభుత్వం లాగేసుకుంటుందని బెదిరించారని… సీఆర్డీఏ వాళ్లు.. ప్రభుత్వం ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ సంతకం పెట్టాలని సంతకాలు తీసుకున్నారని పేర్కొన్నారు. బ్రహ్మనంద రెడ్డి వంటి వారి వెనుక చంద్రబాబు ఉన్నారు కనుకే అసైన్డ్ భూములు కొనుగోలు చేయగలిగారని.. బ్రహ్మనంద రెడ్డిని వెంటనే సీఐడీ అధికారులు అరెస్ట్ చేయాలని డిమాండ్‌ చేశారు. అలాగే… మాజీ ఐఏఎస్ సాంబశివరావు కూడా దీనికి ప్రధాన కారణమని.. అమరావతి భూ కుంభకోణం వెనుకున్న మాస్టర్ బ్రెయిన్ సాంబశివరావేనని ఆరోపించారు.

తుళ్లూరు పరిధిలో అసైన్డ్ భూముల రికార్డులను సాంబశివరావు దొంగతనంగా తరలించారని… నాటి గుంటూరు కలెక్టర్, గుంటూరు జేసీ అప్పటి ఎమ్మార్వో, ఆర్డీఓల ద్వారా అమరావతి భూ కుంభకోణానికి పాల్పడ్డారు. కాంతిలాల్ దండే, కోన శశిధర్ ఇద్దరూ నాడు గుంటూరు కలెక్టర్, జేసీలుగా ఉన్నారని… వీరిద్దరూ దళిత అధికారులయ్యిండీ దళితులకే మోసం చేశారని ఫైర్‌ అయ్యారు. ఎవరైనా సరే సీఐడీ వాళ్లు వదలకూడదని..అధికారుల నుంచి ఆరా తీస్తే సాంబశివరావు పేరు చెప్పొచ్చని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news