రూ.4 లక్షలు లంచం తీసుకుంటూ.. రెడ్ హ్యాండెడ్ గా దొరికింది ఓ లేడీ అధికారిణి. నార్సింగి మున్సిపల్ కార్యాలయంలో టౌన్ ప్లానింగ్ అధికారిగా పని చేస్తున్న మణి హారిక…. రూ.4 లక్షలు లంచం తీసుకుంటూ.. రెడ్ హ్యాండెడ్ గా దొరికింది. మంచిరేవుల లోని వినోద్ అనే వ్యక్తికి చెందిన ప్లాట్ ఎల్ఆర్ఎస్ క్లియర్ చేసేందుకు 10 లక్షల లంచం డిమాండ్ చేసింది మణి హారిక.

ఈ తరుణంలోనే… ఏసీబీని ఆశ్రయించారు వినోద్. రూ.4 లక్షల లంచం తీసుకుంటుండగా మణి హారికను పట్టుకున్నారు పోలీసులు. ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలో సోదాలు కొనసాగుతున్నాయి. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.