కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీల మధ్య ట్విట్ వార్ జరుగుతోంది. కేసీఆర్ ని ఊసరవెల్లి అంటూ.. మానిక్కం ఠాగూర్ ట్విట్ ను రేవంత్ రెడ్డి రీట్విట్ చేశారు. ఇదిలా ఉంటే మరోసారి టీఆర్ఎస్ నేత ఎమ్మెల్సీ కవితకు కౌంటర్ ఇస్తూ ట్విట్ చేశారు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇంఛార్జ్ మానిక్కం ఠాగూర్. ఉదయం మానిక్కం ఠాగూర్ ను ఉద్యేశిస్తూ.. తెలంగాణ కోసం కేసీఆర్ గారు మరియు టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం వహించిన ప్రజా ఉద్యమం అని అది బహుమతి కాదుంటూ.. ఇది పోరాటం, నిజం గెలిచిందంటూ ట్విట్ చేశారు ఎమ్మెల్సీ కవిత.
దీనికి మానిక్కం ఠాగూర్, కవితకు కౌంటర్ ఇచ్చారు. కవిత గారూ..తెలంగాణ ఒక్క నాయకుడి ఉద్యమం కాదు. ఇది ప్రజా ఉద్యమం. అందుకోసం అందరూ చేయి చేయి కలిపి పోరాడారు. అయితే కోటి కలలను సాకారం చేసింది సోనియమ్మ సంకల్పమే అని..తెలంగాణ ఏర్పాటుకు కాంగ్రెస్ కారణమని ఇటీవల మోదీ ఆరోపించారని..మర్చిపోవద్దు అంటూ ట్విట్ చేశారు.