ఇటీవల వర్షాలకు హైదరాబాద్ లో నాలాలు, కాలువలు పొంగిపొర్లాయి. నాలాలో పడి ఇద్దరు వ్యక్తులు కూడా మరణించారు. మణికొండలో నాలాలో పడి సాఫ్ట్ వేర్ ఇంజనీర్ రజినీ కాంత్ మరణించడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించింది. ఈ ఘటనపై ప్రభుత్వం కూడా సీరియస్ చర్యలు తీసుకుంటుంది. ఘటనపై రాష్ట్ర పురపాలక శాఖా మంత్రి కేటీఆర్ బాధ్యత తీసుకుంటానని వెల్లడించారు. మరణించిన రజినీకాంత్ కు రూ. 10 లక్షల ఎక్స్ గ్రేషియా కూడా ప్రకటించారు. తాజాగా ఘటనకు కారణమైన వారిపై ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. నాలా పూడ్చివేతలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు కాంట్రాక్టర్లను చర్యలు తీసుకుంది. కాంట్రాక్టర్లు రాజ్ కుమార్, కుమారస్వామిని నార్సింగ్ పోలీసులు అరెస్ట్ చేసి పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఇప్పటికే ఇద్దరు కాంట్రాక్టర్లను మున్సిపల్ అధికారలు సస్పెండ్ చేశారు.