యూపీ ఘటనపై దేశవ్యాప్తంగా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నేడు దేశవ్యాప్తంగా రైతులు నిరసన తెలియజేయనున్నారు. రైతు చట్టాల రద్ధు కోసం యూపీలో రైతుల నిరసన హింసలకు దారి తీసింది. నిన్న యూపీ డిప్యూటీ మినిష్టర్ కేశవ్ ప్రసాద్ మౌర్యకు నిరసన తెలిపే క్రమంలో మొత్తం 8 మంది మరణించారు. ఇందులో 4గురు రైతులు ఉండటం ఉద్రిక్తతలకు కారణం అయింది. మంత్రి కాన్వాయ్ వేగంగా వెళ్లే క్రమంలో ప్రమాదం చోటు చేసుకుంది. రైతులు మరణించడంతో రైతులు ఉద్రిక్తత మరింత తీవ్రమయింది. దీంతో కాన్వాయ్ లోని వాహనాలకు నిప్పంటించారు. ఈఘటనలో పలువురు బీజేపీ కార్యకర్తలు కూడా మరణించారని సమాచారం.
ఉత్తర్ ప్రదేశ్ లఖీంపూర్ ఖేరీ జిల్లాలో ఘటన జరిగింది. ఈఘటన పై ప్రతిపక్షాలు, రైతు సంఘాలు ఆందోళనకు పిలుపునిచ్చాయి. నేడు ప్రతిపక్ష నాయకులు ఘటనా స్థలాన్ని సందర్శించేందుకు పిలుపు నిచ్చారు. బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు ప్రతిపక్ష నాయకులు యూపీకి వెళ్లనున్నారు. దీంతో లఖీంపూర్ కు ప్రతిపక్షాల పర్యటన నేపథ్యంలో 144 సెక్షన్ విధించారు.